వై.ఎస్.ఆర్ కడప జిల్లా బద్వేలు తాసిల్దార్ తాసిల్దార్ కార్యాలయం ముందు ఇద్దరు మహిళల ఆత్మహత్యాయత్నం
బద్వేల్ తహసిల్దార్ కార్యాలయం ముందు గురువారం ఇద్దరు మహిళలు పెట్రోల్ తో వచ్చి ఆత్మహత్య యత్నం చేశారు దాదాపు గంటకుపైగా వారు కార్యాలయం ముందు బైఠాయించి తమ నిరసన తెలిపారు వివరాలు ఇలా ఉన్నాయి స్థానిక రజక వీధికి చెందిన లే బాకు చంద్రమ్మ శంకవరం సాలమ్మ అనేవారికి సర్వే నెంబర్ 1770/, 1770/2 లో ఒక్కొక్కరికి రెండు సెంట్లు ప్రకారం ఇంటి స్థలం ఇచ్చారు 1993లో అప్పటి బద్వేలు తాసిల్దార్ సుబ్బరాయుడు వీటిని ఇవ్వడం జరిగింది ఇచ్చిన పట్టాలను బద్వేల్ పట్టణానికి చెందిన అలగ్జాండర్ ఏసోబు అనే వ్యక్తులు దౌర్జన్యంగా సదరు ఇంటి స్థలము లో ఇంటి నిర్మాణ పనులు చేస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని తాసిల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు న్యాయం చేయకపోతే పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంటామని వారు హెచ్చరించారు వారి ఆందోళనతో బద్వేలు తాసిల్దార్ మల్లికార్జున్ రెడ్డి వారి వద్దకు వచ్చి రికార్డులను పరిశీలించి తగిన న్యాయం చేస్తామని మహిళలకు హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు
చివరకు దర్నాకు దిగిన మహిళల రికార్డ్ ఫేక్ అని తెలడంతో చురకలు అంటిన R D O ఇటువంటి వారి పైన కఠినమైన చర్యలు తిసుకోని కేసులు నమోదు చెయాలి తాసిల్దార్ లకు ఆదేశాలు జారి చేసిన బద్వేల్ ఆర్డిఓ వెంకట రమణ.
Comments