వై.ఎస్.ఆర్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
నేడు స్థానిక టీడీపీ కార్యాలయం నందు ఆ పార్టీ ఇంచార్జి జీవీ ప్రవీణ్ కుమార్ రెడ్డి పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు, ఈ సందర్భంగా ఆయన నియోజకవర్గ వైసీపీ నాయకులు భూ కబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. వివరాల్లోకి వెళితే రేగళ్లపల్లెకు చెందిన సానేపల్లి గంగమ్మ 1981లో ఎకరా యాబై సెంట్ల భూమిని లక్ష్మి రెడ్డి నుండి కొనుగోలుచేసిందని, మొత్తంగా ఈవిడకు చెందిన అయిదు ఎకరాల నలబై అయిదు సెంట్ల భూమి నేడు కబ్జాకు గురి అయ్యిందని, కోర్టు నందు కేసు నడుస్తుండగా అత్తా కోడలు మధ్య విబేధాల నేపథ్యంలో, కోడలు తన తల్లి పేరు మీద అక్రమ రిజిస్ట్రేషన్ చేసిందని ఆరోపించారు. ఇదిలా ఉండగా స్థానిక వైసీపీ నాయకుల రంగప్రవేశంతో మూలే సుబ్బలక్షుమ్మ ద్వారా మ్యుటేషన్ చేయించి, సానేపల్లి భాస్కర్ రెడ్డి పేరుతో ఎకరా నలబై సెంట్ల భూమి రిజిస్టర్ కాగా, యాలం శంకర్ పేరుతో ఒక ఎకరా అయిదు సెంట్ల స్థలం రిజిస్టర్ చేసినట్లు, మిగులు మూడు ఎకరాల భూమి మంచాల మదన్ కుమార్ పేరుతో రిజిస్టర్ చేయించి వృద్ధురాలయిన గంగమ్మ భూమిని దురాక్రమణ చేశారని ఆరోపించారు.
కాగా సానేపల్లి గంగమ్మ మాట్లాడుతూ తన కోడలికి తనకి మనస్పర్థల కారణంగా భూమి విషయమై తాము కోర్టును ఆశ్రయించామని, వ్యవసాయ ఆధారిత భూమి కావున అదే తనకు తన పిల్లలకు ఆధారమని, నాయకులు అధికారులు తక్షణం స్పందించి తగు న్యాయం చేయాలని కోరారు.
Comments