కోర్టు అవరణలో న్యాయ సేవ దినోత్సవం
నందలూరు మండలం లో గల జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఆవరణలో మండల లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ మరియు జూనియర్ న్యాయమూర్తి కే.లత న్యాయ సేవ దినోత్సవాన్ని పురస్కరించుకొని న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పేద ప్రజలకి, మహిళలకి, ఎస్సీ, ఎస్టీలకు, ఆర్థికంగా వెనుకబడిన వారికి వికలాంగులకి, మానసిక రోగులకి ఉచితంగా న్యాయం అందించడం, న్యాయం అందరికీ అందుబాటులో ఉంటుందని తెలియజేయడమే లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆక్ట్ ముఖ్య ఉద్దేశమని తెలియజేశారు లీగల్ సర్వీసెస్ అధారిటీ ఆక్ట్ అమల్లోకి వచ్చిన రోజుని న్యాయ సేవ దినోత్సవంగా జరుపుకుంటు నామని తెలియజేశారు. అందరూ న్యాయ సేవలు గురించి తెలుసుకోవాలని అన్నారు. న్యాయ విజ్ఞాన సదస్సులు నిర్వహించి ప్రజలలో అవగాహన కల్పించడం లోక్ ఆదాలత్ ద్వారా రాజీమార్గం ద్వారా రాజీ చేసుకోవడం ఈ లీగల్ సర్వీసెస్ అధారిటీ ఆక్ట్ ముఖ్య లక్షణం అని తెలియజేశారు.
న్యాయవాదులు లాభా పేక్ష కోసం కాకుండా సమాజ శ్రేయస్సు కోసం పాటుపడాలని అన్నారు. ఫ్రీ లిటిగేషన్ కేసులు చాలా పరిష్కరించామని చాలా కేసులు ఎఫ్.ఐ.ఆర్ తో పని లేకుండా పరిష్కరించబడినవి అని చాలామంది భార్యాభర్తలు ఫ్రీ లిటిగేషన్ కేసులు చాలా పరిష్కరించామని సంతోషం వ్యక్తం చేశారు. న్యాయవ్యవస్థ పై విద్యార్థులు అవగాహన కలిగివుండాలి అని న్యాయ సేవ ఉద్యమానికి ఆధారం రాజ్యాంగంలో ఉంది అని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఏపీపీ ఉమారాణి, ఎంఆర్ఓ నందలూరు సత్యానందం, న్యాయవాదులు ఎస్. మహమ్మద్ అలీ, హెచ్ ఆనంద్ కుమార్, జి. సుబ్బరామయ్య, ఏవి సుబ్రహ్మణ్యం, షమీవుల్లా ఖాన్, అనుదీప్, వినయ్ కుమార్, పోలీసులు, పి ఎల్ వీలు , కోర్టు సిబ్బంది, కక్షిదారులు పాల్గొన్నారు.
Comments