మేనిఫెస్టో కాదు హామీ పత్రాలు - లింగా రెడ్డి
వైయస్సార్ జిల్లా, ప్రొద్దుటూరు
సెప్టెంబర్ ఒకటో తేదీ నుండి 'భవిష్యత్ గ్యారెంటీ ఇది బాబు గ్యారెంటీ' అనే కార్యక్రమం 45 రోజులపాటు ఆంధ్రప్రదేశ్ లోని అన్ని నియోజకవర్గాలలో జరగనున్నట్లు, ఇందులో టిడిపి ప్రధాన నాయకులు, నియోజకవర్గ ఇన్చార్జిలు, కమిటీ సభ్యులు, సామాజిక సాధికార కమిటీలు పాల్గొంటారని టిడిపి నాయకులు మల్లెల లింగారెడ్డి ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో వెల్లడించారు 'తల్లికి వందనం' అనే పథకం కింద ప్రతి ఏటా 15 వేల రూపాయలు చదువుకునే ప్రతి విద్యార్థిని విద్యార్థికి అందించనున్నట్లు, 18 సంవత్సరాలు నిండిన మహిళలకు నెలకు 1500 రూపాయల చొప్పున సంవత్సరానికి 18000, రైతులకు 20 వేల రూపాయలు, యువఘలం నిరుద్యోగ భృతి కింద నిరుద్యోగులకు ప్రతినెల 3000 రూపాయలు, దీపం పథకం కింద ప్రతి ఇంటికి సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు, జిల్లాల వారీగా ఆయా జిల్లాలలో నివసించే మహిళలకు జిల్లా వ్యాప్తంగా ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, నీటి కుళాయిలు లేని నివాస గృహాలకు ఉచిత కొళాయి కనెక్షన్లు ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు.
పేదల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే తమ ముందున్న లక్ష్యంగా పై పథకాలను అమలు చేస్తామని, ఇందులో టిడిపి నాయకులు కార్యకర్తలు 45 రోజులపాటు నియోజకవర్గ, మండల స్థాయిలో ప్రతి పల్లెలలోని ప్రతి ఇంటికి తిరిగి వివరాలు సేకరించి, పై పథకాలకు అర్హులను గుర్తించి వారికి హామీ పత్రం ఇవ్వనున్నట్లు, ఇచ్చిన హామీ పత్రంలో ఏవైతే పథకాలు నాయకులు హామీ ఇస్తారో, వాటిని టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అమలు చేస్తారని, ప్రతి ఎన్నికలలో ఇచ్చే మ్యానుఫెస్టోలకు భిన్నంగా హామీ పత్రాన్ని టిడిపి విడుదల చేస్తున్నట్లు, కావున ప్రజలు కూడా విరివిగా ఈ కార్యక్రమంలో పాల్గొని, టిడిపి నాయకులకు కార్యకర్తలకు సహకరించి హామీ పత్రాలు పొందవలసిందిగా ఆయన కోరారు. ఇకపోతే టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువఘలం పాదయాత్ర 200 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా యువఘలం పాదయాత్రకు సంఘీభావంగా గురువారం నాడు ప్రతి నియోజకవర్గంలో మూడు కిలోమీటర్ల యువఘలం సంఘీభావ పాదయాత్ర చేయనున్నట్లు ఆయన తెలిపారు.
Comments