top of page
Writer's pictureEDITOR

మద్యం కంపెనీల మంజూరు విషయంలో అక్రమ కేసులు పెట్టడం నీచమైన చర్య

మద్యం కంపెనీల మంజూరు విషయంలో అక్రమ కేసులు పెట్టడం నీచమైన చర్య

మాట్లాడుతున్న బీసీ నాయకులు సమ్మెట

బడుగు బలహీన వర్గాల అభ్యున్నతిని అణచివేయడమే వైసీపీ ప్రభుత్వ లక్ష్యం


తెలుగుదేశం పార్టీ బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి సమ్మెట శివప్రసాద్


గత నాలుగున్నర సంవత్సరాల వైసీపీ ప్రభుత్వం లో అనేక రకాల నకిలీ, పిచ్చి బ్రాండ్లతో మద్యం పంపిణీ చేసి ప్రజల జీవితాలతో ఆడుకోవడమే కాకుండా వేలాది మంది ప్రజల ప్రాణాలను పొట్టన పెట్టుకోవడమే కాకుండా, లక్షలాదిమంది ప్రజలు అనారోగ్యం పాలు చేసి,ప్రజల జీవితాలతో ఆటలాడుకోవడం మీ సైకో, నియంత పాలనకు నిదర్శనమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బీసీ సెల్ సెక్రెటరీ సమ్మెట శివప్రసాద్ తీవ్రంగా ఆరోపించారు. అన్నమయ్య జిల్లా,రాజంపేట పార్లమెంట్ అధ్యక్షులు చమర్తి జగన్ మోహన్ రాజు గారి సూచనల మేరకు గురువారం స్థానికంగా ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వేల కోట్ల రూపాయలు దండుకొని కనీసం మద్యం షాపుల్లో డిజిటల్ కరెన్సీ లేకుండా కేవలం నగదు లావాదేవీలు జరిపి లక్షల కోట్ల కుంభకోణాలు చేసిన మీరా ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు గారిని, బడుగు బలహీనవర్గాలకు చెందిన మాజీ మంత్రివర్యులు కొల్లు రవీంద్రల మీద తప్పుడుకేసులు పెట్టడం హాస్యాస్పదమని వారు ఎద్దేవా చేశారు. ప్రభుత్వమే మద్యం షాపులను నిర్వహిస్తుందన్న నెపంతో మీరు, మీ బినామీల పేరుమీద వివిధ రకాల పిచ్చి బ్రాండ్లతో డిస్ట్రిలరీ కంపెనీలను మీ అనుయాయులకు ధారాదత్తం చేసింది కాక ఈరోజు మాజీ ముఖ్యమంత్రివర్యులు, మాజీ మంత్రివర్యులు మీద తప్పుడు కేసులు పెట్టడం ఎంతవరకు సభమని వారు నిలదీశారు. దమ్ముంటే గత ప్రభుత్వంలో జరిగిన మద్యం లావాదేవీలకు ప్రస్తుత మీ వైకాపాలనలో సైకో రెడ్డి అవినీతి మద్యం విషయంలో బహిరంగంగా చర్చించడానికి మేము సిద్ధమని వారు చాలెంజ్ విసిరారు.


గత ఎన్నికల ప్రచారంలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిస్థాయి మధ్య నిషేధం చేస్తామని హామీ ఇచ్చి హామీని గాలి వదిలేసిన సైకో రెడ్డి తప్పు చేయని వారి మీద అక్రమ కేసులు బనాయించి నువ్వు పిచ్చి ఆనందాన్ని పొందుతున్నావు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొదట్లో 50 రూపాయలు విలువచేసే మద్యాన్ని అనేక రెట్లు పెంచి 300, 500 రూపాయలు చేసి, మద్యం ముట్టుకుంటే షాక్ కొట్టాలన్న దాని నుండి కొన్ని ఫైవ్ స్టార్ సంస్థలకే మద్యాన్ని పరిమితం చేస్తానని చెప్పి ఈరోజు నీ అనుయాయులైన మీ సొంత సామాజిక వర్గం నేతలకు ప్రాంతాలుగా విభజించి అనేక రకాల అక్రమ, నకిలీ మద్యం కంపెనీలను సృష్టించి కల్తీ, దొంగ మద్యాన్ని పంపిణీ చేసే నువ్వా ఈరోజు నిజాయితీపరులైన మాజీ ముఖ్యమంత్రి, మాజీ మంత్రుల మీద దొంగ కేసులు పెట్టి వారిని ఇబ్బందులు గురి చేస్తున్నావు.ఇవన్నీ కేవలం తాత్కాలికమేనని గుర్తించుకోవాలని మనవి, ఇందుకు నిదర్శనమే నువ్వు అన్ని వ్యవస్థలను మేనేజ్ చేసి ఇప్పుడు చంద్రబాబునాయుడు గారిని అరెస్ట్ చేసి,52 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్ లో అక్రమంగా, అన్యాయం గా నిర్బంధించారు. కానీ న్యాయం బ్రతికేవుందని ఈరోజు ఆయన మద్యంతర బెయిల్ పై విడుదల కావడమే నిదర్శనం. కేవలం బడుగు బలహీన వర్గాల నాయకుడైన కొల్లు రవీంద్ర అభ్యున్నతిని అణచివేయడం కోసమే దొంగ కేసులు నమోదు చేసి వారిని ఇబ్బంది పెడుతున్నావు. భవిష్యత్తులో దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని వారు తీవ్రంగా హెచ్చరించారు.


గత నాలుగు సంవత్సరాలుగా నీ పిచ్చి కల్తీ బ్రాండ్ల మద్యాన్ని తాగి లక్షల మంది ప్రజలు, నిరుపేదలు, కూలినాలి చేసుకొని బ్రతికే వారు కూడా మీ సైకో జగన్ ప్రభుత్వం లో పిచ్చి బ్రాండ్లతో,నాసిరకం మందు త్రాగి అనారోగ్యం పాలై ఆసుపత్రుల్లో చేరి లక్షల రూపాయల డబ్బులు పోగొట్టుకుంటున్నారు. ఇప్పటికైనా కళ్ళు తెరుచుకుని కల్తీ లేని మధ్యాన్ని సరఫరా చేసి ప్రజల ప్రాణాలను కాపాడాలని, నిజాయితీపరులైన తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకుల పై అక్రమ కేసులు నమోదు చేసి అభాసుపాలు కావద్దని వారు హితవు పలికారు


ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ బీసీ నేతలు చామంచి పెంచలయ్య, కానుకుర్తి వెంకటయ్య, తెలుగు యువత నాయకుడు తోట శివశంకర్, బీసీ నాయకులు కల్లూరు సుబ్బరాయుడు, జాగటి వెంకటరమణ, జనసేన నాయకుడు మారం శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

50 views0 comments

Comentarios

Obtuvo 0 de 5 estrellas.
Aún no hay calificaciones

Agrega una calificación
bottom of page