13వ తేదీ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలి - సీనియర్ సివిల్ జడ్జి.
ప్రసన్న ఆంధ్ర, రాజంపేట
ఈనెల 13వ తేదీన జరిగే జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని సీనియర్ సివిల్ జడ్జి కేశవ తెలియజేశారు. మంగళవారం కోర్టు నందు డి ఎస్ పి చైతన్య, అర్బన్, రూరల్ సీఐ లు నరసింహారావు, పుల్లయ్య అర్బన్, రూరల్ ఎస్సైలు, చిట్వేలి, పుల్లంపేట, నందలూరు ఎస్సైలతో సీనియర్ సివిల్ జడ్జి కేశవ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అన్ని సివిల్ కేసులు, పరిష్కరించుకోబడిన క్రిమినల్ కేసులు లోక్ అదాలత్ లో పరిష్కరించుకోవాలని పోలీసులకు సూచించారు. పరిష్కారం కాబడిన సివిల్ కేసులకు చెల్లించబడిన స్టాంప్ డ్యూటీ తిరిగి చెల్లించడం జరుగుతుందని తెలిపారు. నందలూరు జూనియర్ సివిల్ జడ్జి కే.లత మాట్లాడుతూ రాజీమార్గమే రాజమార్గమని, లోక్ అదాలత్ లో కేసులు పరిష్కరించుకున్న వారికి కాలము, డబ్బు ఆదా అవుతుందని., లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించబడిన కేసులకు అప్పీల్ ఉండదని, లోక్ అదాలత్ తీర్పు సుప్రీంకోర్టు తీర్పుతో సమానమని తెలియజేశారు.
Comments