జాతీయ లోక్ అదాలత్ లో 625 కేసులు శాశ్వత పరిష్కారం
నందలూరు మండల లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ , సివిల్ జడ్జి కే .లతా ఆధ్వర్యంలో హ్యూమన్ రైట్స్ డే కార్యక్రమం శనివారం కోర్టు ఆవరణ లో నిర్వహించారు. అనంతరం జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు నందు జాతీయ లోక్ అదాలత్ ను సివిల్ జడ్జ్ కే లతా నేతృత్వంలో 625 కేసులకు శాశ్వత పరిష్కారం లభించిందని తెలియజేశారు. సివిల్ కేసుల్లో రూపాయిలు 21,16,308/- , క్రిమినల్ కేసులు రూపాయలు 87,200/- ఫిర్యాదారులకు అందజేయడం జరిగిందని తెలియజేశారు . పి ఎల్ సి కేసులలో రూపాయలు 1,87,500/-, బ్యాంక్ పి ఎల్ సి లలో రూపాయలు 1,50,000 లబ్ధిదారులకు లాభం చేకూరినట్లు తెలిపారు. ఇతర క్రిమినల్ కేసుల్లో రూపాయిలు 2,31,500/- గవర్నమెంట్ ఖాతాకు జమ చేయడం జరిగిందన్నారు. మొత్తం రూపాయలు 34,07,308/- పరిష్కారం చేయడం జరిగింది అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏ.పీ.పీ. నందలూరు ఉమారాణి, ఏ.పీ.పీ రాజంపేట, రెహనా రసూల్, లాయర్ లు డి. నరసింహులు, మహమ్మద్ అలీ, ఆనంద్ కుమార్, సెమీ ఉల్లా ఖాన్, సుబ్బరామయ్య, అనుదీప్, మీనా , మోహన్ , మహమ్మద్ అలీ, పిఎన్ శ్రీనివాసులు కోర్ట్ కానిస్టేబులు, కోర్టు సిబ్బంది, పారా లీగల్ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.
Comentários