top of page
Writer's picturePRASANNA ANDHRA

లోకా సమస్త మానవ హక్కుల పరిరక్షణ మండలి లోగో ఆవిష్కరణ

లోకా సమస్త మానవ హక్కుల పరిరక్షణ మండలి లోగో ఆవిష్కరణ


ప్రసన్న ఆంధ్ర - ప్రొద్దుటూరు, లోకా సమస్త అంతర్జాతీయ మానవ హక్కుల పరిరక్షణ మండలి సంస్థ లోగో ఆవిష్కరణ కార్యక్రమం నేడు వైయస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలోని బుశెట్టి కళ్యాణ మండపంలో జరిగింది. సంస్థ ఫౌండర్ నేషనల్ చైర్మన్ జి.పి.నరసింహులు, డైరెక్టర్ నేషనల్ ఉమెన్ వింగ్ చైర్ పర్సన్ ఏ.వి.నలిని నాయుడు అధ్యక్షత వహించగా, కార్యక్రమానికి ముఖ్య అతిధిగా తెలంగాణ మాజీ మంత్రి అడ్వకేట్ సి.కృష్ణ యాదవ్ పాల్గొని లోగోను ఆవిష్కరించారు. కార్యక్రమంలో రిటైర్డ్ ఆర్మీ జెసిఓ, ప్రస్తుత బెంగళూరు ఎయిర్ ఫోర్స్ విజిలెన్స్ డిపార్ట్మెంట్ మెంబర్ ఏ.వి.కె నాయుడు, రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ జెడబ్ల్యుఓ కె, ప్రస్తుత చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఐ.టి.సి.గ్రూప్స్ కె.శ్రీనివాస్, ప్రముఖ న్యాయవాది గొర్రె శ్రీనివాస్, అడ్వకేట్ డా.వినోద్ గోవింద్ సత్పుటే (మహారాష్ట్ర), మాజీ టీటీడి బోర్డు మెంబర్ చిప్పగిరి ప్రసాద్, అడ్వకేట్ రమ్య శెట్టి (బెంగళూరు), అడ్వకేట్ పుప్పాల శ్యామల (హైదరాబాద్), చిల్డ్రన్ స్పెషలిస్ట్ డాక్టర్.నాగార్జున (పొద్దుటూరు) తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ప్రజలకు వారు ప్రాథమిక హక్కుల గురించి అవగాహన కల్పించి చైతన్యవంతులను చేయడమే మానవ హక్కుల సంఘాల ముఖ్య ఉద్దేశ్యమని, మానవ హక్కులు ప్రతి వ్యక్తికి ప్రసాదించబడిన అత్యంత ప్రాథమిక హక్కులని, కావున మానవ హక్కులు వ్యక్తి పుట్టినప్పటి నుండి మరణించే వరకు వారి హక్కులను భూమిపై ఉన్న ప్రతి ఇతర మానవుడు, వారి కులం, మతం, మతం, లింగం, జాతీయత, సామాజిక స్థితి లేదా రంగుతో సంబంధం లేకుండా మానవ హక్కులకు అర్హులు అని, వారి హక్కులు సంబంధిత దేశ చట్టాల ద్వారా రక్షించబడుతున్నాయి అన్నారు. మానవుల హక్కులు మరియు స్వేచ్ఛలను ప్రదర్శించడానికి, మానవ హక్కుల సార్వత్రిక ప్రకటన (UDHR) అని పిలువబడే ఒక చారిత్రక పత్రం 1948 సంవత్సరంలో స్థాపించబడింది అని. ఇది నిజానికి మానవ హక్కుల ప్రాథమిక సూత్రాలపై మొదటి అంతర్జాతీయ ఒప్పందం అని, ఈ ఒప్పందం ద్వారానే నేటి సమాజంలో మానవ హక్కుల సంస్థలు నెలకొల్పబడుతున్నాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు ప్రజా సమస్యల పరిష్కారం కొరకు స్థాపించిన లోకా సమస్త అంతర్జాతీయ మానవ హక్కుల పరిరక్షణ మండలి జాతీయ చైర్మన్ జి.పి నరసింహులు కు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియచేసారు.

122 views0 comments

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page