OPINION :
పెట్రోలియం రూల్స్, 2002లోని సెక్షన్ 8, ఏ వ్యక్తికైనా సీసాలు మరియు కంటైనర్లలో పెట్రోలియం అమ్మడం మరియు తీసుకెళ్లడాన్ని నిషేధిస్తుంది. పెట్రోలు అమ్మకానికి సంబంధించిన నిబంధనల గురించి తనకు తెలియదని బైక్ యజమాని మనోజ్ కుమార్ అన్నారు. “ప్లాస్టిక్ బాటిళ్లలో పెట్రోలు అమ్మకూడదని నాకు తెలియదు".
ఆంధ్రప్రదేశ్, అమరావతి, ఇటీవల ప్సశ్చిమగోదావరి జిల్లా కామవరపుకోట మండలం ఈస్ట్ యడవల్లి గ్రామంలో ఏరువ సుబ్బలక్ష్మి కి చెందిన పాన్ దుకాణంలో షార్ట్ సర్క్యూట్ వలన మంటలు చెలరేగి అమ్మకానికి ఉంచిన పెట్రోల్ బాటిళ్లు అంటుకుని, దుకాణంలో ఉన్న సుబ్బలక్ష్మి కూతురుకి అగ్నికీలలు అంటుకోగా కాపాడటానికి వెళ్లిన తల్లి కూడా అగ్నికి ఆహుతి అయ్యి తీవ్రగాయాల పాలయ్యారు. కాపాడటానికి స్థానికులు అన్ని ప్రయత్నాలు చేశారు, తల్లి కూతుళ్ళ ఆర్తనాదాలు మిన్నంటాయి.
ఇటువంటి దురదృష్టకర సంఘటనలు మానవ తప్పిదాల వలనే జరుగుతున్నాయి అనటంలో ఏమాత్రం సందేహం లేదు, కాగా మారుమూల గ్రామాలు లేదా పల్లెల్లో పెట్రోల్ అమ్మకాలు పలు దుకాణాలలో జోరుగా సాగుతున్నాయి, ఆదాయ వనరులు పెంచుకునే దిశగానే ఇలా బాటిళ్లలో పెట్రోల్ అమ్మకాలు చేస్తున్నారు దుకాణ యజమానులు. పలు జాగ్రత్తలు తీసుకోవలసిన దుకాణదారుడు పెట్రోల్ అమ్మకానికి ఉంచిన చోటే పాన్, సిగరెట్ తదితర అమ్మకాలు జరపటం, అజాగ్రత్త లేదా షార్ట్ సర్క్యూట్ వలన అగ్ని ప్రమాదం సంభవించే అవకాశాలు ఉన్న దుకాణదారులు అలసత్వం ప్రదర్శించటం వారి ప్రాణాలకే ముప్పుగా పరిగణించవచ్చు.
రాష్ట్రం లోని పలు చిన్న మధ్యతరగతి దుకాణాలలో ఇలా బాటిళ్లలో పెట్రోల్ ఇప్పటికి అమ్ముతున్నారు, పైగా వేసవి కాలం కావటం చేత మరింతగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున దుకాణదారులు బాటిళ్లలో పెట్రోల్ అమ్మటం సబబు కాదనే కొందరి వాదన. నగరాల్లో కూడా పలు దుకాణాలలో బాటిళ్లలో పెట్రోల్ అమ్మకాలు జరుగుతున్నాయి, నగరాల్లో ప్రతి అయిదు వందల మీటర్లకు లేదా ఉన్న ప్రాంతానికి దెగ్గరలోనే పెట్రోల్ పుంపులు అందుబాటులో ఉండగా, పేద మధ్యతరగతి వాహనదారులు వారి వారి ఆర్ధిక స్థోమతలను బట్టి వాహనాలకు పెట్రోల్ నింపుకుంటుండగా, అత్యవసర పరిస్థితులలో దుకాణాలలో పెట్రోల్ వేయించుకునే పరిస్థితి ఏర్పడుతోంది. ఏది ఏమయినా ఇక్కడి దుకాణాల్లో అమ్మకాలు కొనుగోళ్లు ప్రజల అవసరాల వలనే జరుగుతున్నాయి అనేది వాస్తవం. ఇకనయినా దుకాణదారులు మేల్కొని వారి వ్యాపార సముదాయములో బాటిళ్లలో పెట్రోల్ అమ్మకుండా చూసుకోవాలి, వేసవి కాలం కావటం చేత వేడి లేదా నిప్పు వలన త్వరగా మండే స్వభావం కలిగిన పెట్రోల్ అమ్మకాలు దుకాణాలలో నిషేధించాలి అని ప్రజలు కోరుకుంటున్నారు. సంబంధిత అధికారులు తగు చర్యలకు ఉపక్రమించి ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి.
ప్లాస్టిక్ బాటిళ్లలో పెట్రోల్ ఎందుకు వాడరు?
పెట్రోలులో ప్లాస్టిక్ కరిగిపోతుంది, మినరల్ వాటర్ బాటిల్స్ PET (పాలిథిలిన్ టెరెఫ్తాలేట్)తో తయారు చేయబడ్డాయి మరియు ప్లాస్టిక్ PET బాటిళ్లు పెట్రోల్‌లో కరిగిపోతుంది. కాబట్టి పెట్రోలును PET బాటిళ్లలో నిల్వ ఉంచేటప్పుడు ప్లాస్టిక్ కరిగిపోయి ప్రమాదకర పరిస్థితిని సృష్టిస్తుంది.
Comments