వైభవంగా శ్రీ శివపార్వతుల కళ్యాణం.
-----అలరించిన అన్నమాచార్య కీర్తనలు
--పెద్ద ఎత్తున అన్నదానం.
కళ్యాణం తిలకిస్తున్న భక్తులు.
చిట్వేలు మండల పరిధిలోని రాజుకుంట పంచాయతీ అనుంపల్లి గ్రామం నందు మాదినేని సుబ్బారావు సుశీలమ్మ దంపతుల సంకల్పంతో గ్రామస్తుల సహకారంతో నిర్మించిన నూతన శివాలయ ప్రారంభోత్సవంలో భాగంగా మంగళవారం మొదలు కొని బుధవారం వరకు మూడు రోజులపాటు రాయపెద్ది సుబ్రహ్మణ్యం (సుబ్బు) శర్మ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలను నిర్వహించారు.
తొలుత ధ్వజారోహణ, మూల విగ్రహ ప్రతిష్ట ఘనంగా నిర్వహించారు. గురువారం ఉదయం ప్రాణ ప్రతిష్ట, శివపార్వతుల ఉత్సవ విగ్రహాలకు కల్యాణ మహోత్సవాన్ని చేపట్టి భక్తులకు పరమశివుని దర్శనాన్ని కల్పించారు. ప్రత్యేక బృందం వారు ఆలపించిన అన్నమాచార్య కీర్తనలు ఆకర్షణగా నిలిచాయి.
అనంతరం మధ్యాహ్నం వేలాది మంది భక్తులకు భోజనాన్ని నిర్వహించారు. సాయంత్రం కల్యాణోత్సవ విగ్రహాలను పురవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. గ్రామ ప్రజలు,మహిళలు, యువత పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.
చిట్వేలి మండల వ్యాప్తంగానే కాక పరిసర జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు కార్యక్రమంలో పాల్గొన్నారు. మాదినేని కుమార్ ,శివ, నరేష్, విశ్వనాథం, నాగరాజా, బాలకృష్ణ తదితరులు కార్యక్రమ నిర్వాహకులు గా వ్యవహరించారు. స్థానిక డిసిసి బ్యాంకు అధ్యక్షులు ప్రదీప్ రెడ్డి, ముక్కా సాయి వికాస్ రెడ్డి తదితరులు కళ్యాణ ఉత్సవంలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
Comments