శ్రీశ్రీశ్రీ రాగి చెట్టు శివాలయం లో ద్వితీయ వార్షికోత్సవం.
అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలంలోని కె బుడుగుంట పల్లిలో స్వస్తిశ్రీ శుభకృత నామ సంవత్సరం కార్తీకమాసం కృష్ణపక్షం తిథియగు సోమవారం ... ఆ గ్రామంలోని శివాలయంలో ఉన్న రాగి చెట్టుకు గ్రామ దేవత ప్రార్థన, మహాగణపతి పూజ, శుద్ధ పుణ్య వాచకము మరియు ఉత్సవ మూర్ఖులకు అభిషేకం, కళాకర్మ, ధూపద్వీప నైవేద్యం, మంగళహారతి, తీర్థప్రసాద వినియోగము తదితర పూజలు నిర్వహించారు.
రైల్వే కోడూరు పట్టణ, చుట్టు ప్రక్కల గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించి రాగి చెట్టుకున్న మహిమలు,రాగి చెట్టుకు ఉన్న కన్ను రూపం, వినాయక రూపం, లింగ రూపం, ఐదు సిరిసిల్లనాగుపాము రూపాలకు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించారు. ప్రతి రోజూ శివాలయంలోని రాగి చెట్టును నిత్యం పూజించటం ఇక్కడ పరిపాటి.
ఈ శివాలయానికి పంచలోహా విగ్రహలను యజ్ఞం రామకృష్ణయ్య,సుబ్బమ్మ ల కుమారుడు గ్రామ ఉపసర్పంచ్ చంద్రశేఖర్ సమకూర్చారు. పార్వతి పరమేశ్వరుల కళ్యాణం, అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని శివయ్య సతీమణి చంద్రకళ ఆధ్వర్యంలో జరగక పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని తమ భక్తి భావాన్ని చాటుకున్నారు.
Comentários