అనకాపల్లి జిల్లా, సబ్బవరం
సబ్బవరం లో లిక్విడ్ సిమెంట్ ట్యాంకర్ అగ్నికి ఆహుతి - లారీ డ్రైవర్ కి తృటిలో తప్పిన ప్రాణాపాయం.
అనకాపల్లి జిల్లా సబ్బవరం మండల కేంద్రం శివారు జోడు గుళ్లు విజ్ఞాన్ పబ్లిక్ స్కూల్ సమీపంలో జాతీయ రహదారిపై షార్ట్ సర్క్యూట్ అవ్వడంతో లిక్విడ్ సిమెంట్ ట్యాంకర్ కు హఠాత్తుగా అగ్ని ప్రమాదానికి గురై దగ్ధమైంది.
అయితే అదే సమయంలో లారీ సిబ్బంది, లిక్విడ్ సిమెంట్ ట్యాంకర్ను రోడ్డు పక్కన పార్క్ చేసి టీ పాయింట్లో టీ తాగటానికి వెళ్లడంతో తృటిలో ప్రాణాపాయం తప్పింది.
ఈ సంఘటనకు సంబంధించి స్థానిక పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఎలమంచిలి వద్ద గల మహా సిమెంట్ ఫ్యాక్టరీ నుంచి లిక్విడ్ సిమెంట్ తో భువనేశ్వర్ వెళ్తున్న ట్యాంకర్ బుధవారం సాయంత్రం నాలుగున్నర గంటల ప్రాంతంలో సబ్బవరం రోడ్డు వద్ద రోడ్డు పక్కన పార్క్ చేసి బ్బంది టీ తాగడానికి వెళ్లారు.
ఆ సమయంలో హఠాత్తుగా ట్యాంకర్ నుంచి మంటలు రావడంతో స్థానికులు లారీ సిబ్బందికి తెలిపారు. అంతే కాకుండా స్థానిక ఫైర్ స్టేషన్కు సమాచారం అందించారు.
దీంతో అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి వచ్చేసరికి లిక్విడ్ సిమెంట్ ట్యాంకర్ క్యాబిన్ మొత్తం కాలిపోయింది. అయితే ఎంత విలువైన లిక్విడ్ సిమెంట్ మాత్రం ఎలాంటి అగ్ని ప్రమాదానికి గురి కాలేదని హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణ తెలిపారు.
అయితే లారీ డ్రైవర్ గుచు. ప్రసాద్ భువనేశ్వర్ కి చెందిన వాడని తన ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామన్నారు.
ఇటీవల కాలంలో రోడ్లపైనే లారీలు దగ్దం కావటం ఇలాంటి సంఘటన చూసిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు. స్థానిక అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు.
コメント