ఉక్కునగరం ప్రసన్న ఆంధ్ర విలేకరి, LTC,LTA సమస్య పరిష్కారం అని స్టీల్ గుర్తింపు యూనియన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కామ్రేడ్ జె అయోధ్య రామ్, కామ్రేడ్ వైటి దాస్ అన్నారు. ఈరోజు స్టీల్ సి ఐ టి యు ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం ఉక్కు నగరం సిఐటియు కార్యాలయంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా స్టీల్ సిఐటియు అధ్యక్షులు కామ్రేడే జె అయోధ్య రామ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు స్టీల్ యాజమాన్యం పొదుపు పేరుతో కార్మికులకు అమలు చేయవలసిన LTC,LTA లను నేటి వరకు అమలు చేయకుండా తాత్సారం చేసిందని ఆయన తీవ్రంగా విమర్శించారు. వీటిని అమలు చేయడానికి యాజమాన్యంతో అనేక చర్చలు జరిపి, చివరికి నేడు యాజమాన్యం అంగీకరిస్తూ సర్క్యులర్ ను విడుదల చేసిందని ఆయన వివరించారు. దీని ద్వారా 2018-19 ఆర్థిక సంవత్సరంలో ఉపయోగించవలసిన LTC ని కార్మికులు ఉపయోగించుకోవాలని ఆయన అన్నారు. అలాగే 2020-21 ఆర్థిక సంవత్సరం తో ముగుస్తున్న LTC,LTA లను 2023 వరకు పొడిగిస్తూ యాజమాన్యం అంగీకరించిన విషయాన్ని ఆయన స్పష్టం చేశారు. దీని ద్వారా నూతన కార్మికులు అనేక మంది లబ్ధి చేకూరుతుందని ఆయన అన్నారు.
ప్రధాన కార్యదర్శి వై టి దాస్ మాట్లాడుతూ కార్మిక ప్రయోజనాలను తాకట్టు పెట్టే సంస్కృతి సి ఐ టి యు సంఘానికి లేదని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై నిరంతరం పోరాడుతూ, ప్రభుత్వ రంగాన్ని రక్షించుకునేందు ఐక్య ఉద్యమాలు నిర్మించాల్సిన బాధ్యతను ఏనాడూ వదల లేదని ఆయన వివరించారు. ఈ పరిస్థితులలో విశాఖ ఉక్కు కర్మాగారంలో గుర్తింపు ఎన్నికలు జరుగుతున్నాయని దీనిలో సి ఐ టి యు ని బల పరచవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఆయన కోరారు.
ఈ సమావేశంలో స్టీల్ సిఐటియు గౌరవాధ్యక్షులు డాక్టర్ బి గంగారావు, స్టీల్ సిఐటియు నాయకులు బి అప్పారావు, జె సింహాచలం, యు రామస్వామి, గంగాధర్, టి వి కె రాజు, కె వి సత్యనారాయణ, యు వెంకటేశ్వర్లు, ఆనంద్, పట్టా రమేష్, ఎమ్.వి.రమణ, సి హెచ్ సూర్యనారాయణ, బి మహేష్ తదితరులతోపాటు వివిధ విభాగాల అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు.
Comments