80 శాతం ప్రజలు తిరిగి జగన్ పరిపాలన రావాలని కోరుకుంటున్నారు - రాచమల్లు
వైయస్సార్ జిల్లా, ప్రొద్దుటూరు
రాష్ట్రంలో 80 శాతం ప్రజలు తిరిగి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని ప్రొద్దుటూరు నియోజకవర్గ శాసనసభ్యులు రాచమల్లు శివప్రసాద్రెడ్డి అన్నారు.
జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమంపై స్థానిక ఆర్ అండ్ బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రజా మద్దతు వైయస్సార్సీపి కి మెండుగా ఉందని, రాష్ట్రవ్యాప్తంగా ఏడు లక్షల మంది వాలంటీర్లు ఒక కోటి నలబై అయిదు లక్షల కుటుంబాలలో ఒక కోటి నలబై లక్షల కుటుంబాలకు జగన్ సర్కార్ చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరించి, వారి వారి నియోజకవర్గాలలో చేయవలసిన అభివృద్ధిని తెలుసుకొని, ప్రభుత్వంపై వారి అభిప్రాయాలను సేకరించి, లోపాలను తెలుసుకున్నారని అన్నారు.
కార్యక్రమంలో భాగంగా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో తొంబై ఒక్క వెయ్యి గడపలు ఉండగా దాదాపు ఎనవై ఒక్క వెయ్యి అయిదు వందల యాబై ఐదు గడపలకు వాలంటీర్లు పార్టీ నాయకులు వెళ్లి ప్రభుత్వంపై ప్రజల అభిప్రాయాలు తెలుసుకున్నారని, దాదాపు 62,686 మిస్డ్ కాల్స్ ప్రజలు జగన్ ప్రభుత్వానికి మద్దతుగా చేశారని, సాంకేతిక కారణాల వలన దాదాపు 12 వేల మిస్డ్ కాల్స్ వెళ్లలేదని అన్నారు.
ఇవి కాకి లెక్కలు కావని, కానీ రాబోవు రోజుల్లో ప్రతిపక్షాలు వీటిని కాకి లెక్కలుగా అభివర్ణిస్తాయని ఆయన జోష్యం చెప్పారు. ఎన్నికలకు ముందు దేశంలోని ఏ పార్టీ కూడా ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాన్ని చేపట్టి ప్రజల ముందుకు వెళ్లలేదని, తమ నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యాన్ని గౌరవించే వ్యక్తి అని, పేదరికం, నిరక్షరాస్యతను సమూలంగా నిర్మూలించటమే జగన్ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
Comments