శివనామ స్మరణతో మారుమ్రోగిన శైవ క్షేత్రాలు.
----వీరభద్ర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు.
శివుడికి ప్రీతికరమైన మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా చిట్వేలి మండల పరిధిలోని శైవ క్షేత్రాలు శివనామ స్మరణతో మారు మ్రోగాయి. వేకువజాము నుంచే ప్రత్యేక అలంకరణలు,పూజలు గావించిన స్వామి అమ్మ వార్ల ను వేలాది మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ఆలయంలో ద్వాజా రోహణం, నంది పూజ, కంకణ ధారణ, నవగ్రహ పూజ, మధ్యాహ్నం చండీహోమం, అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సాయంత్రం రుద్రహోమం, లింగోద్భవ పూజ, అభిషేకాలతో పాటుగా శనివారం ఉదయం కళ్యాణం,అన్నదాన కార్యక్రమం ఉంటుందని ఆలయ పెద్దలు తెలియపరిచారు.
శ్రీ వీరభద్రుని ఆలయంలో చండీ హోమం
శ్యామలాంబ సమేత సోమేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు కళ్యాణం, లింగోద్భవ కార్యక్రమం నిర్వహించారు. కర్కటేశ్వరుని ఆకారమైన గుండాల కోనకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వెళ్లారు.అనుంపల్లి, తిమ్మాయిపాలెం, నగిరిపాడు, నక్కలపల్లి, శ్రీ దత్తగిరి స్వామి ఆశ్రమం నందు తదితర గ్రామాల శివాలయాలలో మూల విగ్రహాలను ప్రత్యేక పూజాలు,గీతాపారాయనం,అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు.
రాజుకుంట గ్రామంలో అన్నదానం, ఊరేగింపు అగ్నిగుండం కార్యక్రమాన్ని గ్రామ యువత నిర్వహించారు.కాగా మండల పరిధిలోని ప్రతి గ్రామంలోనూ ప్రజలు మహా శివరాత్రి సంబరాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. గ్రామ పెద్దలు, మహిళలు,యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Comments