మహేశ్వర్ రెడ్డి హత్య కేసులో నిందితుడు అరెస్ట్
వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
ప్రొద్దుటూరు వైఎంఆర్ కాలనీ నందు సంచలనం సృష్టించిన మహేశ్వర్ రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రామచంద్రారెడ్డిని అరెస్టు చేసినట్లు ప్రొద్దుటూరు డిఎస్పి మురళీధర్ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి వెల్లడించారు. ఈ సందర్భంగా స్థానిక మూడో పట్టణ పోలీస్ స్టేషన్ నందు ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో డిఎస్పి మురళీధర్ మాట్లాడుతూ, మహేశ్వర్ రెడ్డి తల్లి అయిన నాగరత్నమ్మ భర్త మరణించడంతో గడచిన 15 సంవత్సరాలుగా రామచంద్రారెడ్డి ఆమెతో సహజీవనం చేస్తున్నట్లు, కాగా ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యి జులాయిగా తిరుగుతున్న మహేశ్వర్ రెడ్డిని భారతి సిమెంట్స్ నందు పనికి చేర్చినట్లు, ఈ క్రమంలో మహేశ్వర్ రెడ్డి ప్రతి రోజు మద్యం సేవించి అటు తల్లిని ఇటు తనను చిత్రహింసలకు గురి చేసేవాడని, అలాగే తమ స్వీట్ షాప్ నందు పనికి వచ్చే ఒక మహిళతో అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తుండగా ఇది గమనించిన తాను 23వ తేదీ రాత్రి మందలించగా, తమకు రావలసిన మూడు లక్షల రూపాయల డబ్బు ఇస్తే తాను తన తల్లి ఎటైనా వెళ్లి జీవనం కొనసాగిస్తామని రామచంద్రారెడ్డికి చెప్పినట్లు, అయితే తనను తనతో సహజీవనం చేస్తున్న మహేశ్వర్ రెడ్డి తల్లి అయిన నాగరత్నమ్మ ను ఎక్కడ విడదీస్తాడో అనే సందేహంతో, తల్లి నాగరత్నమ్మ ఇంటిలోని లోపల గదిలో నిద్రిస్తుండగా మృతుడు మహేశ్వర్ రెడ్డి మరియొక గది నందు నిద్రిస్తున్న సమయాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వీట్ షాప్ నందు లడ్డు తయారు చేసే రాడ్డుతో నిద్రిస్తున్న మహేశ్వర్ రెడ్డి తలపై గట్టిగా కొట్టగా అక్కడికక్కడే మహేశ్వర్ రెడ్డి మృతి చెందినట్లు, అనంతరం మృతదేహాన్ని మూడు భాగాలుగా చేసి ప్రొద్దుటూరు పట్టణ శివారులోని రాయల్ కౌంటీ వద్ద గల కాలువ నందు పడవేసినట్లు డీఎస్పీ మురళీధర్ వివరించారు.
సంచలనం రేపిన ఈ హత్యోదంతాన్ని ఛాలెంజ్ గా తీసుకున్న పోలీసులు టీములుగా ఏర్పడటమే కాకుండా డాగ్ స్క్వాడ్ ను పిలిపించి మృతుడి శరీర భాగాల కోసం అలాగే నిందితుడి కోసం వెతుకులాట ప్రారంభించినట్లు, హత్యకు ఉపయోగించిన ఒక గొడ్డలి అలాగే కత్తిని సీజ్ చేసినట్లు, ఇంటిలోని బీరువా నందు రాడ్ రక్తపు మరకలు గల బట్టలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. విచారణలో భాగంగా చెన్నూరు వద్దగల కొండపేట నందు నిందితుడు వారి బంధువుల ఇంటిలో ఉండగా అరెస్టు చేశామని, ఇంకా పలువురు సాక్షులను ఈ కేసు నందు విచారించవలసి ఉంది అని, ముద్దాయికి శిక్ష పడే విధంగా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలుపుతూ, త్వరితగతిన ముద్దాయిని అరెస్టు చేసిన ప్రొద్దుటూరు పట్టణ సీఐలకు అలాగే రాజుపాలెం పోలీసులకు అభినందనలు తెలుపుతూ, పోలీసుల నైపుణ్యం, చాకచక్యం, ప్రస్తుత టెక్నాలజీతో ఎలాంటి కేసునైనా తాము చేదిస్తామని ఆయన భరోసానిస్తూ, నిందితుడిని అరెస్టు చేయటంలో చాకచక్యంగా వ్యవహరించిన సిఐ, ఎస్ఐ, సిబ్బందిని రివార్డుకు సిఫారసు చేస్తున్నట్లు తెలిపారు.
Comments