మహిళ మండలి సమాఖ్య లో అంతా మా ఇష్టం అంటున్న అనిమేటర్లు
. గ్రూప్ సభ్యులకు వారు చెప్పిందే వేదం.
. నాయకుల అండదండలతో స్వంత నిర్ణయాలు.
. అనిమేటర్లు చెప్పిందే ఏ పి యం, సి సి లు వినాలి.
. ఎ గ్రూప్ లో లేని వారిని అనిమెటర్ గా నియామకం.
నందలూరు మండలంలోని మహిళ మండలి సమాఖ్య, డ్వాక్రా గ్రూపు లో అనిమేటర్లు చెక్కు చేతల్లో ఆ సంస్థ మండల అధికారులు తంజావూరు బొమ్మల వల్లే ఉండిపోయారు అని గ్రూపుల సభ్యులు విమర్శిస్తున్నారు. దీనికి కారణం లేకపోలేదు, డ్వాక్రా గ్రూపు సభ్యులకు ఆనిమేటర్లు చెప్పేదే ఫైనల్ దానిపై పైస్థాయి అధికారులతో చర్చించేందుకు వెళితే ఆ గ్రూపు సభ్యులపై కక్ష సాధింపు ధరణిలో వ్యవహరిస్తున్నారు అని కొంతమంది చెప్పుకొస్తున్నారు. మామూలుగా ఆనిమేటర్ల పని ప్రతినెల వారికి కేటాయించిన గ్రూపులో అన్నిటికీ సమావేశాలు నిర్వహించి వారికి రావలసిన లోనులు విషయంలోనూ గ్రూపులు కట్టవలసిన మొత్తము బ్యాంకులకు కట్టించే వాటిపైన చర్చించి ఆ సమావేశ తీర్మానాన్ని పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి వారు దాన్ని పరిశీలించి ఆన్లైన్లో లెక్కిస్తారు, కానీ మండలంలో ఆనిమేటర్లు ఏమి చేస్తున్నారు మండల అధికారి ఏపిఎం కు మరియు సిసి కు తెలియకుండా జరుగుతున్నాయంటే ఆనిమేటర్ల యొక్క హవా ఎలా ఉందో అర్థమవుతుంది. ఈ మధ్యకాలంలో ఆరు నెలల నుంచి ఒక గ్రూపు కి ఎటువంటి సమావేశం నిర్వహించలేదని ఏపీఎం దృష్టికి వారు తీసుకెళ్లినప్పటికీ ఇంతవరకు ఆ గ్రూపుకు సంబంధించిన అనిమేటర్ పై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం మరొక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇలాగా చెప్పుకుంటూ పోతే మండలంలో యధారాజా తధాపగా అన్నట్టుగా కార్యకలాపాలు వెలుగు ఆఫీస్ నుండి జరుగుతున్నాయి. అలాగే ఒక బ్యాంకులో ఉన్న గ్రూపులను మరొక బ్యాంకులోకి మారాలని కండిషన్లు పెట్టి మారుతీనే మీకు లోన్లు వస్తాయని వారిపై ఒత్తిడి తీసుకొచ్చి గ్రూపులను బ్యాంకుల మార్చి వేయడం ఏమిటో అర్థం కాని పరిస్థితి. గ్రూప్ సమస్యలు ఏపీఎం మరియు సిసి లు విని పరిష్కరించాల్సింది పోయి ఆనిమేటర్ల గురించి మాకు చెప్పొద్దండి వారికి మండల నాయకులు అండదండలు మెండుగా ఉన్నాయని వారిని మేము ఏమీ చేయలేమని ఒక మండల అధికారి చెప్పడం ఆశ్చర్యాని కలిగిస్తుంది. ఏ గ్రూపులో లేనటువంటి ఒకరిని యానిమేటరుగా నియమించడం వెనక ఎంత పెద్ద రాజకీయ నాయకులు అండదండలు ఉన్నాయో తెలిసిపోతుంది ఏదో ఒక గ్రూపులో సభ్యురాలుగా ఉండే వారిని ఆనిమేటర్ కమిటీ సభ్యులు ఎన్నుకుంటారు. గత ఆరు నెలల నుండి ఏ గ్రూపులో సభ్యురాలుగా లేని వారిని ఆనిమేటర్ గా కొనసాగిస్తూ ఉన్న ఏపిఎం మరియు సిసి పై ఒత్తిడి ఏమాత్రం ఉందో పూర్తిగా అర్థమవుతుంది. ఇదే విషయాన్ని ఆరోపల్లెకు చెందిన ఒక గ్రూపు వారు రాతపూర్వకంగా కంప్లైంట్ ఇచ్చినప్పటికీ దానిపై ఇప్పటివరకు ఎటువంటి విచారణ కానీ చర్యలు కానీ తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తుంది. గ్రూపుల ద్వారా మహిళలను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం డి.ఆర్.డి.ఎ. సంస్థతో కలిసి మండలాలో ఉన్న ప్రతి గ్రామంలో మహిళా సంఘాలను ఏర్పాటు చేసి వారి అభివృద్ధికి తోడ్పాటు అందించాల్సిన ఈ సంస్థ రాజకీయ నాయకుల చేతుల్లో కీలుబొమ్మగా మారిపోయిందని రాజకీయ నాయకులు ఏది చెబితే దానికి మండల అధికారులు తలూపుతున్నారని, కొన్ని గ్రూపుల సభ్యులు అంటున్నారు. ఒక లోను రాసిన ఆనిమేటర్కు కనీసం 500 నుండి 1000 రూపాయలు ఆ గ్రూపు సభ్యులు కచ్చితంగా ఇచ్చే ఆనవాయితీ నందలూరులో ఇప్పటికీ కొనసాగుతూ ఉంది. యానిమేటర్లకి ఇచ్చే జీతాలు కన్నా గ్రూపు సభ్యులు ఇచ్చే మామూలే ఎక్కువగా ఉంది అని విమర్శ. దీనిపై మండల మహిళ సమాఖ్య ఏపీఎం వసుందర ను వివరణ కోరగా.. ఆమె మాట్లాడుతూ ఒక యానిమేటర్ ఏ గ్రూపులో లేదని అరవపల్లి కి చెందిన ఒక ఎస్ హెచ్ జి గ్రూప్ వారు నాకు రాధ పూర్వకంగా ఇచ్చిన కంప్లైంట్ ను సంబంధిత పిడి కి పంపడం జరిగిందని దీనిపై విచారణ మా సి సి చేస్తున్నారు అని పూర్తి వివరాలు రాగానే వారిపై చర్యలు తీసుకునేందుకు వెనకాడబోమని అలాగే ఏ గ్రూపు వారైనా లోను రాసిన అందుకు డబ్బులు ఇవ్వమని ఆనిమేటర్ డిమాండ్ చేస్తే తన దృష్టికి తీసుకు వచ్చిన యెడల వారిపై కూడా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Comments