పేద, బడుగు, బలహీనవర్గాల, మైనారిటీల కోసం పుట్టిందే వైఎస్సార్ సిపి అని వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మల్లిశెట్టి వెంకటరమణ ఆదివారం విలేకరుల సమావేశంలో చెప్పారు.
ప్రజా సమస్యలు నేరుగా తెలుసుకోవడం కోసం వైయస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర లో 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేశారని గుర్తు చేశారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చారని అన్నారు. 2019 లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 50 శాతం పైగా ఓట్లతో 151 స్థానాలు లో శాసనసభ ; 22 లోక్ సభ స్థానాలను గెలుచుకొని అఖండ విజయం సాధించారని తెలిపారు. ఏ రాజకీయ పార్టీ ఎదుర్కొనీ సమస్యలు,సవాళ్లు, దాడులను వైఎస్ఆర్సిపి ఎదుర్కొంటుందని అన్నారు.
జగన్ పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను వంద శాతం అమలు చేసి మేనిఫెస్టోను భగవద్గీత, ఖురాన్, బైబిల్ తో సమానంగా భావించి వైయస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు. వైయస్సార్ స్పూర్తితోనే వైయస్ జగన్మోహన్ రెడ్డి జనరంజక పాలన అందిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో అధికారం వచ్చిన మూడేళ్లలోనే సీఎం వైఎస్ జగన్ మూడు దశాబ్దాల అభివృద్ధిని ప్రజలకు చేసి చూపించారని తెలిపారు. సంక్షేమం అంటే జగన్; జగన్ అంటే సంక్షేమం అని పేర్కొన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్ఆర్ సీపీ పెనుసంచలనం అని అన్నారు. 2.56 లక్షల కోట్ల బడ్జెట్లో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకూ ప్రాధాన్యత కల్పించారని చెప్పారు.
అభివృద్ధి, సంక్షేమం రెండు చక్రాలు గా భావించి వివిధ కార్యక్రమాలు, పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, కాపు, బిసి ల ఇతర సంక్షేమం కోసం సీఎం జగన్మోహన్ రెడ్డి నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రజా సంక్షేమానికి వైఎస్ఆర్సిపి ప్రజా ప్రతి రూపమని తెలిపారు. వైఎస్ఆర్సీపీకి నానాటికీ ప్రజాదరణ పెరుగుతుండటంతో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని పేర్కొన్నారు.
కార్యకర్తలు జారిపోకుండా కాపాడుకునే దానికి ముందస్తు ఎన్నికలనీ కలలు కంటున్నారని చెప్పారు.
గ్రామ, వార్డు, సచివాలయ ,వాలంటరీ వ్యవస్థను ఏర్పాటు చేసి, ప్రజల ఇళ్ల వద్దకు ప్రభుత్వ సేవలను తీసుకెళ్లారనీ; కరోనా సమయంలోనూ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ఆగకుండా చర్యలు తీసుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించారనీ సంక్షేమ అభివృద్ధి పథకాల అమలుతో పాటు సుపరి పాలన అందిస్తున్నడంతో ప్రజలు వైఎస్ఆర్సీపీకి బ్రహ్మరథం పట్టారనీ... ఈ దేశంలో ఎక్కడా లేని రీతిలో పంచాయితీ, మండల, పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయం సాధించిందనీ...దాంతో దేశంలో స్కోచ్ సంస్థ నిర్వహించిన సర్వేలో సుపరిపాలన లో "ఆంధ్ర రాష్ట్రం నెంబర్ వన్" గా నిలిచిందనీ తెలియజేశారు.
Comments