ఏపీ కనీస వేతనాల అడ్వైజరీ బోర్డు మెంబర్ గా
మల్లిశెట్టి వెంకటరమణ.
ఆంధ్రప్రదేశ్ కనీస వేతనాల అడ్వైజరీ బోర్డు మెంబర్ గా మల్లిశెట్టి వెంకటరమణ ను నియమిస్తూ లేబర్ కమిషన్ ముఖ్య కార్యదర్శి హరి జవహర్ లాల్ మంగళవారము ఉత్తర్వులు ఇచ్చారు. రెండేళ్లపాటు మల్లిశెట్టి ఈ పదవిలో కొనసాగనున్నారు.
అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గానికి చెందిన మలిశెట్టి వెంకటరమణ వైయస్సార్సీపి పాదయాత్రలో వైఎస్ జగన్ వెంట నడిచారు.
ప్రస్తుతం వైఎస్ఆర్సిపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా ఉన్నారు. మలిశెట్టి వెంకటరమణ అన్నమయ్య జిల్లా చిట్వేలి మండలం భాకరాపురం కొత్తపల్లి గ్రామంలో జన్మించారు.రాజకీయాలంటే మక్కువ కావడంతో రాజకీయంగా అంచల అంచలంచలుగా ఎదుగుతూ వస్తున్నారు. వైఎస్ఆర్సిపి పార్టీని వైఎస్ జగన్మోహన్ రెడ్డినీ దేవునిగా కొలుస్తూ, విధేయుడుగా ఉంటూ, పార్టీని అంటిపెట్టుకుని క్రియాశీల రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటూ వస్తున్నారు.
జగన్ పాదయాత్రలో ఆయనతో పాటు పాదయాత్ర చేయడం వివిధ జిల్లాల పార్టీ సీనియర్లు, పెద్దలతో సఖ్యతతో కొనసాగడం రాయలసీమ జిల్లాలో తన తన వంతుగా పార్టీ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటూ వస్తున్నారు.ఎక్కడో కుగ్రామంలో జన్మించి రాష్ట్రస్థాయికి ఎదగడం అనేది ఆశామాసి కాదు. ఆయన క్రమశిక్షణ, పట్టుదల, కష్టంతో పాటు కాలం కలిసి వచ్చి ప్రస్తుతం వైయస్సార్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా కొనసాగుతున్నారు. అవకాశాన్ని కల్పించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
అలాగే తన ఎంపికకు తోడ్పడు అందించిన ఎం.పీ మిథున్ రెడ్డి కి ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు కి, పుల్లంపేట ఎంపీపీ ముద్దాబాబుల్ రెడ్డి కి, చిట్వేలి మండల కన్వీనర్ చెవ్వు శ్రీనివాసులు రెడ్డి కి,చిట్వేలి సర్పంచి ఉమామహేశ్వర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తూ వారి సహకారం మరవలేనన్నారు.ఆంధ్రప్రదేశ్ కనీస వేతనాల అడ్వైజరీ బోర్డు మెంబర్గా మలిశెట్టి వెంకటరమణ ఎంపిక చేయడంపై రైల్వే కోడూరు నియోజకవర్గం వైయస్సార్ సిపి నాయకులు, చిట్వేలి మండల నాయకులు అభినందనలు తెలిపారు.
Comments