వైఎస్ఆర్సిపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మల్లిశెట్టి వెంకటరమణ.
ఏపీకి సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి బ్రాండ్ అంబాసిడర్ అని వైయస్సార్సీపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మల్లిశెట్టి వెంకటరమణ అన్నారు. ఆదివారం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వేలాది మంది పారిశ్రామికవేత్తలు తరలి రావడం జగన్మోహన్ రెడ్డి పట్ల, ఆయన ప్రభుత్వం మీద ఉన్న నమ్మకానికి నిదర్శనమని తెలిపారు. సుమారు 13 లక్షల కోట్లకు సంబంధించి 352 ఒప్పందాలను కుదుర్చుకోవడం గొప్ప విషయమని అన్నారు. వీటి వలన సుమారు 6 లక్షల మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుందని పేర్కొన్నారు.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం యావత్ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందని తెలిపారు.గ్లోబల్ సమ్మిట్ విజయవంతం కావటమే కాకుండా ప్రజల అభివృద్ధి పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని సైతం తెలియజేసిందని అన్నారు. ఈ గ్లోబల్ సమ్మేట్ ను రాజకీయం చేయకుండా ప్రతిపక్షాలు కూడా సహకరిస్తే.. ఆంధ్ర రాష్ట్రం పారిశ్రామికంగా ప్రగతి పథంలో దూసుకెళ్తుందని, దేశంలో అగ్రరాష్ట్రంగా నిలబడుతుందని మలిశెట్టి వెంకటరమణఅన్నారు.
సీఎం జగన్ సమర్థవంతమైన విధానాలు పారదర్శక సంక్షేమ పాలనతో పారిశ్రామికవేత్తలు రాష్ట్ర బాట పట్టారని తెలియజేశారు.పెట్టుబడులు సీఎం జగన్మోహన్ రెడ్డి చరిష్మాతో వచ్చాయని త్వరలో రాష్ట్ర ముఖచిత్రం మారబోతుందని అన్నారు. "విజనరీ లీడర్ షిప్" తో అన్ని రంగాలలో ఏపీ దూసుకెళుతుందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముందుచూపు రాష్ట్ర భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తుందని కొనియాడారు. పెట్టుబడు దారులు ఆంధ్ర ప్రదేశ్ కు తమ తొలి ప్రాధాన్యత ఇస్తున్నారని దీంతో ఏపీ రాష్ట్రం సంక్షేమంతో పాటు పారిశ్రామికంగా మరింత అభివృద్ధి చెందుతుందని తెలియజేశారు ఇప్పటికే లక్షలాది ఉద్యోగాలు కల్పించిన సీఎం జగన్ ఇక యువతకు మరింత అండగా నిలవనున్నారని తెలియజేశారు.
תגובות