విశ్వసనీయత లేని నాయకుడు చంద్రబాబు..
----మల్లిశెట్టి వెంకటరమణ.
చంద్రబాబు నాయుడు విశ్వసనేయత లేని నాయకుడని వైఎస్ఆర్సిపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కనీస వేతన అడ్వైజరీ బోర్డు మెంబర్ మల్లిశెట్టి వెంకటరమణ విమర్శించారు. ఆయన ప్రజల్లో పూర్తిగా నమ్మకం కోల్పోయారన్నారు. ప్రజలను మభ్య పెట్టేందుకు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ రాష్ట్ర ప్రభుత్వంపై ఇష్టానుసారంగా నోరు పారేసుకుంటున్నారని మండిపడ్డారు. చిట్వేలి లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు, లోకేష్ కులాలు, కుటుంబాల మధ్య చిచ్చుపెట్టే స్థాయికి దిగజారారని ధ్వజమెత్తారు. అంత పెద్ద నేతగా పేరొందిన చంద్రబాబు చివరకు తమ్ముళ్లు నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, టిడిపిని గెలిపించండి చౌకగా మద్యం అందిస్తానని సిగ్గు,ఎగ్గు లేకుండా ఓట్లు అడుగుతున్నారని ధ్వజమెత్తారు.
దేశంలోనే బాబు లాంటి నీచమైన నాయకుడిని చూడలేమని విమర్శించారు. ప్రజలకు ఏం మేలు చేశాడో చెప్పడని.. తాను ముఖ్యమంత్రిగా గతం లో పనిచేయలేదన్నట్లు, ఏదో కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పార్లమెంటు నియోజకవర్గంకు సభ అంటూ బయలు దేరాడని, ఆయన సభలకు జనాలు లేకపోయినా జన సునామీ అంటాడని విమర్శించారు. కులాల పేరెత్తి మాట్లాడటం, ఇంత నీచయానికి దిగజారడం అవసరమా? బాబు అని ప్రశ్నించారు.
ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీసీలు జడ్జిలుగా ఉండటానికి అర్హత లేదన్నారు? ఎస్.సి లలో పుట్టాలని ఎవరు కోరుకుంటారు అన్నారు. ధైర్యం ఉంటే సీఎంగా బాబు ఏం చేశారో చెప్పాలి. సీఎం జగన్ ను రాజకీయంగా ఎదుర్కోవాలి, అంతేకానీ దిగజారి మాట్లాడటం ఎంతవరకు సమంజసం? బాబు తన సభల్లో 2014 ఎన్నికల మేనిఫెస్టో తీసుకొని ప్రజలకు చూపిస్తే వీటిలో నేను చేసినవి అన్నీ చేశానని ప్రజలకు చదివి వినిపించాలి. అప్పుడు ఆయన క్రెడిబిలిటీ, నిజాయితీ ప్రజలకు తెలుస్తుంది. వైనాట్ 175 అనేదే మా టార్గెట్ మా నాయకుడి ధైర్యమే మా ధైర్యం. చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వo కులానికి, మతానికి, పార్టీకి ప్రాధాన్యత ఇస్తూ జన్మభూమి కమిటీల ద్వారా మీకు కావలసిన వారికి లంచాలు తీసుకొని ప్రభుత్వ పథకాలు ఇచ్చేవారన్నారు. ఈరోజు గ్రామ సచివాలయం ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికి వాలంటీర్లు సహాయంతో ప్రతి సంక్షేమ పథకాన్ని నిస్వార్ధంగా అందిస్తుంటే మీకు మింగుడు పడకుండా జగన్ ప్రభుత్వం పై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు అని మండిపడ్డారు. మీరు ఎన్ని అడ్డదారులు తొక్కిన ప్రజా సంక్షేమంలో, అభివృద్ధిలో దేశంలో ఉన్న అందరి ముఖ్యమంత్రిలతో పోటీపడుతూ ప్రథమ స్థానంలో దూసుకుపోతున్న జగన్ ఎవరు అడ్డుకోవడం సాధ్యం కాదని తెలియజేశారు. మరొకసారి మేము అధికారంలోకి రావడం ఖాయమని తెలియజేశారు.2024 ఎన్నికల్లో విజయం వైఎస్ఆర్సిపిదే అని మల్లిశెట్టి వెంకటరమణ చెప్పారు.
تعليقات