top of page
Writer's pictureDORA SWAMY

ఓటమి భయంతోనే చంద్రబాబు పొత్తులు.మల్లిశెట్టి

ఓటమి భయంతోనే చంద్రబాబు పొత్తులు.

---రాష్ట్ర ప్రజలు తిరిగి జగనన్నకే పట్టం కడతారు.


మల్లిశెట్టి వెంకటరమణ


ఓటమి భయంతోనే తెలుగుదేశం పార్టీ ప్రతి పక్షాలతో పొత్తులు పెట్టుకుంటుందని రాష్ట్ర కనీస వేతన సవరణ అడ్వైజరీ బోర్డు మెంబర్ మల్లిశెట్టి వెంకటరమణ ఎద్దేవా చేశారు. ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గతంలో అమిత్ షా ఏపీకి వచ్చినప్పుడు ఆయనపై చంద్రబాబు రాళ్లు వేయించిన విషయం ప్రజలు మరిచిపోతారా..?? అని ప్రశ్నించారు. అధికారంలో ఉన్న సమయంలో ఒకలా, అధికారంలో లేని సమయంలో మరోలా రంగులు మార్చడమే చంద్రబాబు నైజం అన్నారు. ఎన్ని పార్టీలు ఏకమై వచ్చినా వైయస్ఆర్సీపీని ఏమి చేయలేరన్నారు. ప్రజలంతా సంక్షేమ పాలన అందించిన జగన్నే మళ్లీ సీఎం గా చేసేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.


నాలుగునర్రరేళ్ళ పాలనలో సంక్షేమ పథకాలను ప్రజల ముందుకు తీసుకెళ్ళిన ఘనత జగనన్నదే అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సంక్షేమ పథకాలు అందుకున్న 80% మంది తిరిగి వైఎస్ఆర్సిపి ప్రభుత్వాన్ని తెచ్చుకోవాలని నిర్ణయించుకున్నారని అన్నారు. 2024 లో జగన్ సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. ప్రతిపక్ష పార్టీలు మళ్లీ పెత్తందారి వ్యవస్థను తేవాలని చూస్తున్నాయన్నారు. గతంలో రుణమాఫీ ,ఇంటికో ఉద్యోగం అని చెప్పిన బాబు వాటికి నెరవేర్చలేదన్న విషయం ప్రజలందరికీ ఇంకా గుర్తుందన్నారు. పొత్తుల ముసుగులో వైఎస్సార్సీపీని ఓడించాలని చంద్రబాబు చూస్తున్నాడని సంగతి ప్రజలకు అర్థమవుతుందన్నారు.


ప్రత్యేక హోదా ఇవ్వకుండా నిరాకరించిన బిజెపితో భాగస్వామిగా ఎన్డీఏలో చేరుతున్నామని చంద్రబాబు ప్రకటించడం తెలుగు ప్రజల ఆత్మగౌరాన్ని తాకట్టు పెట్టడమేనని విమర్శించారు. బిజెపి విద్రోహాన్ని, మతోన్మాదాన్ని 2019 ఎన్నికల్లో చంద్రబాబు దేశమంతా తిరిగి ఎండగట్టారని గుర్తు చేశారు. అదే బిజెపితో కలిసి ఇప్పుడు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని నమ్మబలకటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని రాష్ట్ర కనీస వేతన సవరణ అడ్వైజరీ బోర్డు మెంబర్ మల్లిశెట్టి వెంకటరమణ విమర్శించారు.

93 views0 comments

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page