పాములతో వ్యవహరించే సమయంలో ఎవరైనా జాగ్రత్తగా ఉండాల్సిందే. రోడ్డుపై, అడవిలో పాములు తమ దారిలో అవి వెళ్తుంటే వాటి జోలికి వెళ్లకుండా ఉండటమే ఉత్తమం. అలా కాకుండా పాములతో ఆడుకోవాలని చూస్తే మాత్రం.. అచ్చం ఇదిగో ఈ వ్యక్తికి ఎదురైన ఘోర అనుభవమే రిపీట్ అవుద్ది. ఇంతకీ ఏం జరిగిందంటే..కర్ణాటకు చెందిన మాజ్ సయ్యద్ అనే వ్యక్తి స్నేక్ క్యాచర్. అతని యూట్యూబ్ ఛానల్‌లో పాములకు సంబంధించిన వీడియోలే ఉంటాయి.
అయితే ఓసారి అతను పాముల ముందు కూర్చొని వాటితో సహాసాలు చేశాడు. పాముల తోకలను పట్టుకొని లాగడం, వాటిని కదిలించడం చేశాడు. చేతులు, కాళ్లతో పాములను భయపెడుతుండగా ఊహించని విధంగా అందులోని ఓ పాము అకస్మాత్తుగా వ్యక్తిపై దాడి చేసింది. వ్యక్తి మీదకు జంప్ చేసి అతని మోకాలిని కొరికి పట్టుకుంది. దీంతో షాక్‌కు గురైన వ్యక్తి పామును లాగేందుకు ప్రయత్నించినప్పటికీ అది ఎంతకీ విడిచి పెట్టలేదు.
ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సుశాంత నందా తన ట్విటర్‌లో పోస్టు చేశారు. ‘పాములను ఇలా హ్యండ్లింగ్ చేయడం భయంకరమైనది. వ్యక్తి చేసిన కదలికలను పాము బెదిరింపుగా భావిస్తుంది, వాటిని అనుసరిస్తుంది. కొన్నిసార్లు పాముల ప్రతిస్పందన ప్రాణాంతకం కావచ్చు’ అని కామెంట్ చేశారు. ఈ వీడియో చూసి నెజటిన్లు భయంకరంగా ఉందంటూ కామెంట్ చేస్తున్నారు. పాములతో అలా స్టంట్స్ చేయోద్దని హితవు పలుకున్నారు.
Comments