గురిజాల సేవలు ప్రశంసనీయం - మందకృష్ణ మాదిగ
వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
బుధవారం ఉదయం స్థానిక కొత్తపల్లి పంచాయతీ పరిధిలోని మండి బజార్ రోడ్డులో వికలాంగుల హక్కుల పోరాట సమితి కి జాతీయస్థాయిలో తన సేవలు అందిస్తున్న గురిజాల రామ్ మోహన్ రెడ్డి నూతనంగా నిర్మించిన జిఆర్ఎంఆర్ కార్యాలయాన్ని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, వికలాంగుల హక్కుల పోరాట సమితి అధ్యక్షులు మందకృష్ణ మాదిగ రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలనతో లాంచనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వికలాంగుల ఉద్యమానికి శ్రీకారం చుట్టి నేడు జాతీయస్థాయిలో సేవలు అందిస్తున్న రామ్మోహన్ సేవలను కొనియాడుతూ ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేశారు. కులం, మతం, ప్రాంతం, రాజకీయాలతో సంబంధం లేకుండా మానవతా దృక్పథంతో జరుగుతున్న ఈ వికలాంగుల ఉద్యమాన్ని ముందుండి నడిపించడంలో రామ్మోహన్ సేవలు ఎనలేనివని, జాతీయస్థాయిలో ఎక్కడా లేనివిధంగా ప్రస్తుత ప్రభుత్వం వికలాంగులకు అత్యధికంగా ఆరువేల రూపాయల పెన్షన్ ఇస్తోందని, దేశంలో ఎన్నడూ లేని విధంగా సోషల్ మూవ్మెంట్ నడిపిన ఎమ్మార్పీఎస్ అలాగే వీహెచ్పీఎస్ ఉద్యమాలు దేశంలోనే శక్తివంతమైన ఉద్యమాలుగా ఆయన అభిప్రాయపడ్డారు.
వికలాంగుల సంరక్షణకు సమితి సేవలకు రామ్మోహన్ రెడ్డి తన వంతు సహాయ సహకారాలు అనిర్వచనీయమని, వికలాంగులందరూ ఆయనను ఆదర్శంగా తీసుకొని ఉన్నతమైన సమాజం నిర్మించటంలో కృషి చేయాలని హితువు పలికారు. అనంతరం జాతీయ వికలాంగుల హక్కుల పోరాట సమితి కోర్ కమిటీ మెంబర్గా రామ్మోహన్ రెడ్డికి స్థానం కల్పిస్తున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు యాడికి రమేష్ మాదిగ, ఆర్ బాలయ్య మాదిగ, చింతకుంట ఓబయ్య మాదిగ, మండల అధ్యక్షుడు నాగరాజు, ఓబులేసు, ఆర్ గంగయ్య, వెంకటేశు, తదితరులు పాల్గొనగా, విహెచ్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు అన్నం చిన్న ఓబయ్య యాదవ్, చైర్మన్ ఎల్ గోపాల్ రావు, వైస్ చైర్మన్ అందే రాంబాబు, కడప జిల్లా అధ్యక్షుడు మాతయ్య, రాష్ట్ర నాయకులు సుబ్బారావు, అఫ్జల్, చలపతిరావు, కాజా మొహిద్దిన్, దానమ్మ, సావిత్రి అబ్దుల్, గంగాధర్, యథార్థుడు తదితరులు పాల్గొన్నారు.
Comentarios