top of page
Writer's pictureDORA SWAMY

అధికారులకు హైకోర్టు శిక్ష విధింపు - సి.ఐ.టి.యు హర్షం

మంగంపేట డేంజర్ జోన్ బాధితుల కోర్టు ధిక్కరణ కేసు లో అధికారులకు హైకోర్టు శిక్ష విధింపు పై..

సి ఐ టి యు  జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ హర్షం!

అన్నమయ్య జిల్లా,  ఓబుల వారి పల్లి మండలం, మంగంపేట  ఏపీఎండీసీ డేంజర్ జోన్ బాధితులకు, రెవెన్యూ అధికారులు అయిన రాజంపేట సబ్ కలెక్టర్  ఐఏఎస్   కేతన్,అప్పటి ఏపీఎండీసీ సి పి ఓ గా పనిచేసిన సుదర్శన్ రెడ్డి లకు కోర్టు ధిక్కరణ కేసు, హైకోర్టులో ఆరు నెలలు జైలు శిక్ష రెండు వేలు జరిమానా విధించడం పట్ల సి ఐ టి యు కడప జిల్లా కార్యదర్శి సి హెచ్ చంద్రశేఖర్  హర్షం ,ప్రకటించారు.


మంగంపేట ఏపీఎండీసీ సంస్థ అభివృద్ధి కోసం  బస్టాండ్  ఏరియా వద్ద ఉన్న 90 కుటుంబాలకు, బెనిఫిట్ కల్పిస్తామని, యాజమాన్యం ఇండ్లు తొలగించారన్నారు. ఇంటి స్థలం గాని, ఇంటి బాడుగ గాని,  షిఫ్టింగ్ చార్జీలు గాని, 2003 నుంచి,  ఎటువంటి బెనిఫిట్స్ కల్పించలేదని, రెవెన్యూ అధికారులు, ఏపీఎండీసీ యాజమాన్యం మోసం చేసి అన్యాయం చేసిందని, కోర్టును ఆశ్రయించగా, వారికి న్యాయం చేయమని కోర్టు ఆదేశించగా, కానీ అప్పటి అధికారులు, కోర్టు ఆదేశాలు పాటించని కారణంగా, బాధితులు, అనుమ గుండం నరసమ్మ కోర్టు ధిక్కరణ కేసును  వేయగా, గురువారం హైకోర్టులో, రాజంపేట సబ్ కలెక్టర్ గా పనిచేసిన కేతన్ గార్గే, అప్పటి  సి పి ఓ సుదర్శన్ రెడ్డి లకు హైకోర్టు శిక్ష వేసిందన్నారు.


పేదల పట్ల, బాధితుల పట్ల, అధికారులు గర్వానికి, నిరంకుశత్వానికి, ఇది ఒక హెచ్చరిక అన్నారు, వీరి సమస్యలను గతంలో ఎండి హరి నారాయణ, వీజీ వెంకట రెడ్డి దృష్టికి సిఐటియు నాయకులు తీసుకెళ్ళిన విషయం గుర్తు చేశారు. బాధితులకు న్యాయం  జరగకపోవడం  తో కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని , కోర్టు తీర్పును కూడా  అధికారులు   ధిక్కరించిన వారికి ఇది ఒక గుణపాఠం అన్నారు. ఇప్పటికైనా సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ అధికారులు పేద ప్రజల సమస్యలు చెప్పుకోవడానికి అవకాశం లేదన్నారు, సబ్ కలెక్టర్ గా పనిచేసిన గార్గే కేతన్, పేద ప్రజల సమస్యలు పట్టించుకోలేదని,  అధికార పార్టీఎమ్మెల్యే ఎంపీలు కు మాత్రమే, పనిచేసి పెట్టేవారని, మామూలు ఇచ్చిన వారికే పని జరిగేదన్నారు, వీరి కాలంలో జరిగిన  భూములు ఆన్లైన్లో, టెండర్లపై నా విచారణ జరపాలన్నారు. వందల మంది వీఆర్ఏలు ఆర్టిఓ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించి వినతిపత్రం  తీసుకోవడానికి నిరాకరించారని గుర్తు చేశారు. వేల రూపాయలు తీసుకుంటూ, పనిచేయని ఇటువంటి అధికారులను తక్షణమే ఉద్యోగాల  నుండి తొలగించాలని చంద్రశేఖర్ డిమాండ్ చేశారు.

21 views0 comments

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page