ప్రాథమిక పాఠశాల విలీనాలతో ప్రజల్లో వెల్లువెత్తుతున్న నిరసనలు.
--1 కిలోమీటరు దూరం ఉండడంతో పిల్లల చదువుపై తల్లిదండ్రుల్లో ఆందోళన.
--ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ ఎంఈఓ కు మన్నురువారిపల్లి గ్రామస్తుల వినతి.
రాష్ట్ర ప్రభుత్వం ఒక కిలోమీటర్ పరిధిలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల లోని మూడు, నాలుగు, ఐదు తరగతులను
ఉన్నత పాఠశాలలకు విలీనం చేయడంపై విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వ్యతిరేకిత వ్యక్తం అవుతుంది.
వివరాల్లోకొస్తే అన్నమయ్య జిల్లా చిట్వేలి మండల పరిధిలోని వెంకటరాజుపల్లి, పోల్లోపల్లి,నాగవరం,తదితర గ్రామాలలోని ప్రాథమిక తరగతులైన మూడు, నాలుగు, ఐదు లను సదరు గ్రామాలలోని ఉన్నత పాఠశాలలలో విలీనం చేయగా..
చిట్వేలి సమీపాన గాంధీనగర్ గ్రామంలోని మన్నూరువారిపల్లి పాఠశాల గా పిలవబడు ఈ పాఠశాల నందు ముగ్గురు ఉపాధ్యాయులు సుమారు 60 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తూ ఉండగా వారిలో సుమారు 45 మంది మూడు నాలుగు ఐదు తరగతుల వారు కావడంతో వారందరినీ ఒక కిలోమీటరు దూరం ఉన్నటువంటి కే.కందుల వారి పల్లె ఉన్నత పాఠశాలకు విలీనం చేయడంతో సదరు విద్యార్థుల తల్లిదండ్రులు,గ్రామ ప్రజలు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై నిరసన వ్యక్తం చేస్తూ ఒక కిలోమీటర్ మేర మా పిల్లల వెళ్లడానికి రహదారి వెంబడి రద్దీగా లారీలు, వాహనాలు తిరుగుతూ ఉంటాయని గతంలో కూడా అనేక ప్రమాదాలు చోటుచేసుకున్నాయని చిన్న పిల్లల కావడంతో వారిని మేము ఎలా పంపాలని
నాడు నేడు కింద అత్యంత ప్రమాణాలతో ప్రభుత్వ అభివృద్ధి పరిచిన మా ఊరి పాఠశాలలోనే మా పిల్లల చదువులను కొనసాగించేలా నిర్ణయం తీసుకోవాలని ఈరోజు మండల విద్యాశాఖ అధికారి కి వినతి పత్రం అందజేస్తూ త్వరితగతిన చర్యలు తీసుకుని పిల్లల చదువులు కుంటపడకుండా కొనసాగించేలా చూడాలని పెద్ద ఎత్తున విద్యాశాఖ అధికారిని కోరారు.
మండల విద్యాశాఖ అధికారి పి. రామయ్య వివరణ:. సదరు ప్రజలు అడిగిన ప్రశ్నలకు ఎంఈఓ సమాధానమిస్తూ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వెనక విద్యార్థులకు సబ్జెక్టుల వారీగా బోధనకు వీలయ్యే విధంగా సమీప ఉన్నత పాఠశాలలో విలీనం చేయడం జరిగుతుందని; తద్వారా చిన్న తరగతుల నుంచి అన్ని సబ్జెక్టులపై పట్టు సాధిస్తారని పేర్కొన్నారు.
Comments