ప్రజా సంకల్ప పాదయాత్ర ఐదేళ్లు
- ప్రజల కష్టాలను తెలుసుకునేందుకు పాదయాత్ర చేపట్టిన జగన్.
- పాదయాత్ర హామీలు 98 శాతం పూర్తిగా అమలు.
- సంబరాల్లో పాల్గొన్న వైఎస్సార్సీపీ నేత వై. ప్రదీప్ రెడ్డి.
మంత్రాలయం, రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలో చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర నేటికి 5 సంవత్సరాలు పూర్తి కావడంతో మంత్రాలయం ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి అన్న గారి ఆదేశాల మేరకు మంత్రాలయంలో వైఎస్సార్ సీపీ నేత వై. ప్రదీప్ రెడ్డి ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. ముందుగా ఆర్అండ్ బీ వసతి గృహం నుంచి రాఘవేంద్ర సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం రాఘవేంద్ర సర్కిల్ లో వైఎస్సార్సీపీ మండల ఇన్చార్జ్ విశ్వనాథ్, మండల నాయకులు మాధవరం రామకృష్ణ రెడ్డి తో పాటు నాయకులు, కార్యకర్తల మధ్య కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు సీఎం జగన్ మోహన్ రెడ్డి గతంలో ప్రజా సంకల్ప పాదయాత్ర కు శ్రీకారం చుట్టి నేటికీ ఐదు సంవత్సరాల పూర్తి అయిందని పాదయాత్ర లో ఇచ్చిన హామీలను 98 శాతం అమలు చేస్తు మాట తప్పని మడమ తిప్పని నేత గా ప్రజల్లో గుర్తింపు పొందడం జరిగిందని వై. ప్రదీప్ రెడ్డి అన్న గారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి అశోక్ రెడ్డి, సర్పంచ్ తెల్లబండ్ల భీమయ్య, వ్యవసాయ సలహా మండలి సభ్యులు మల్లికార్జున, వైస్ ఎంపీపీ పులికుక్క రాఘవేంద్ర, జడ్పీటీసీ సభ్యురాలు మజ్జిగ గోవిందమ్మ కుమారుడు రోగప్ప, మండలంలోని ప్రజా ప్రతినిధులు, వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, రాంపురం రెడ్డి సోదరుల అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
Comentarios