top of page
Writer's picturePRASANNA ANDHRA

రాఘవేంద్రుని 351వ ఆరాధన ఉత్సవాలకు ఏర్పాట్లు


కర్నూలు జిల్లా, మంత్రాలయం

ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతులైనటువంటి శ్రీ సుభుదేంద్ర తీర్థులు ఆధ్వర్యంలో శ్రీ రాఘవేంద్ర స్వాముల వారి 351 వ ఆరాధన ఉత్సవాలు గాను ముందస్తు చర్యలు మరియు శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం అభివృద్ధి కార్యక్రమాలు నూతన వసతి గృహాలు మరియు విచ్చేటువంటి భక్తులకు సౌకర్యార్థం సౌచాలయాలు, దూరభారం నుండి వచ్చేటువంటి యాత్రికులకు కార్ పార్కింగ్ వ్యవస్థ, వసతి గృహాలు అందుబాటులో లేనటువంటి యాత్రికులకు పలుచోట్ల టెంపరరీ షెడ్లను కూడా ఏర్పాటు చేస్తామని పీఠాధిపతులు చెప్పి ఉన్నారు.

అంతేకాక నది తీర ప్రాంతం ఉదృతంగా ప్రవహిస్తున్న తుంగభద్రా నది దృశ్య 100 షవర్ పంపులను ఏర్పాటు చేయడం జరుగును, నదిలోకి ఎవరిని కూడా వెళ్లరాదని బార్కెట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగినది, ఈ షవర్లను తుంగభద్రా నది నీటి ద్వారానే మోటార్ పంపు ద్వారా నీరు వచ్చే విధంగా ఏర్పాటు చేయడం జరిగినది, ఆరాధన ఉత్సవాలు భాగంగా నూతనంగా నిర్మించబడ్డ విఐపి గెస్ట్ హౌస్ గెస్ట్, శ్రీ పద్మనాభ తీర్థ మరియు నరహరి తీర్థ గెస్ట్ హౌస్ లను ప్రారంభించడం జరుగుతున్నది, హరికథామృతసార మ్యూజియం, బృందావన్ గార్డెన్ గెస్ట్ హౌస్, బృహత్ రజత పాత్ర సమర్పణ నూతనంగా తులసి తోటను మరియు శ్రీ రాఘవేంద్ర స్వాముల వారి మూల బృందావనంకు నవరత్న కవచం సమర్పణ మరియు శ్రీ మూల రామదేవులకు రజత మంటపము రెన్యువేషన్ గెస్ట్ హౌస్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ దగ్గర ఏర్పాట్లు చేయనున్నట్టు తెలిపారు.


23 views0 comments

Kommentare

Mit 0 von 5 Sternen bewertet.
Noch keine Ratings

Rating hinzufügen
bottom of page