మంత్రాలయం, ఇంటింటి చెత్త సేకరణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పెద్దాయన ఎమ్మిగనూర్ ఆర్టీసి డిపో ఎంప్లాయిస్ యూనియన్ గౌరవ అధ్యక్షులు వై. సీతారామిరెడ్డి అన్న గారు అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ఎంపిడిఓ కార్యాలయంలో నిర్వహించిన ఇంటింటి చెత్త సేకరణ సైకిల్లు పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ముందుగా ఆయా గ్రామాల సర్పంచులకు సైకిల్లు, డస్ట్ బీనులు అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి ఆదేశాల మేరకు స్వచ్ఛ సంకల్పం లో భాగంగా ప్రతి ఇంటి నుంచి తడి, పొడి చెత్తలను పంచాయతీ సిబ్బంది ద్వారా సేకరించి తరలించడం జరుగుతుందని తెలిపారు. ఇందుకు ప్రజలు సహకరించాలని కోరారు . ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్, మండల ఇన్ చార్జ్ జి. భీమిరెడ్డి, సి. వి. విశ్వనాథ్ రెడ్డి, ఎంపిడిఓ నరసింహ రెడ్డి, ఈవోపీఆర్డి నాగేష్, మంత్రాలయం, 52 బసాపురం, చెట్నేహళ్లి, సుంకేశ్వరి సర్పంచ్ లు తెల్లబండ్ల భీమయ్య, రాఘవరెడ్డి, అంజినప్ప, ముక్కరన్న సూగురు వైఎస్సార్సీపీ నాయకులు లక్ష్మయ్య ఉప సర్పంచ్ లు హోటల్ పరమేష్, వీరనాగప్ప వైస్ ఎంపీపీ పులికుక్క రాఘవేంద్ర, ఎంపిటిసి సభ్యులు వెంకటేష్ శెట్టి, వ్యవసాయ సలహా మండలి సభ్యులు మల్లికార్జున, ముఖ్య నాయకులు, రాంపురం రెడ్డి సోదరుల అభిమానులు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments