మీరే మాకు ఆదర్శం... మీరు చూపిన అడుగుజాడలలో నడుస్తాము.. పట్టణ టీడీపీ మైనారిటీ అధ్యక్షులు KMD.ఫారుక్.
ప్రజా సంక్షేమమే తన అభిమతంగా మార్చుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోసం వారి అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్న నిత్య కృషీవలుడు. ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినోత్సవం సందర్భంగా మరియు ఎమ్మిగనూరు నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత ఎమ్మిగనూరు నియోజకవర్గం గౌ .మాజీ శాసనసభ్యులు రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు జయ నాగేశ్వర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులే మిన్న అన్న అక్షర సత్యాన్ని పాటిస్తూ KMD . ఫారుక్ నారా చంద్రబాబు నాయుడి గారి మరియు బి వి జయ నాగేశ్వర్రెడ్డి గారికి ఆశయాలను నెరవేర్చడంలో భాగంగా ఈరోజు "ఎమ్మిగనూరు పట్టణంలో ఉన్నటువంటి దివ్యాంగుడు అయినటువంటి నిరుపేద భాస్కర్ కుమార్తె వివాహం కొరకు కు ముస్లిం మైనార్టీ తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు KMD ఫారుక్ గారు ఆర్థిక సహాయాన్ని అందించి తన దాతృత్వాన్ని చాటుకోవడం జరిగింది. రాబోయే 2024 ఎన్నికల్లో తిరిగి చంద్రబాబు నాయుడు గారి అధికారాన్ని చేపట్టి బిసి ఎస్టి .ఎస్సి మైనార్టీలకు యువతులకు ఇచ్చే పెళ్లి కానుక దుల్హన్ వంటి పథకాలను తిరిగి ప్రారంభించి అనేక మంది నిరుపేదలైన తల్లిదండ్రులకు ఈ పెళ్లి కానుక ఇచ్చి వారి కళ్ళల్లో ఆనందం చూడడమే నారా చంద్రబాబు నాయుడు గారి ప్రధాన లక్ష్యం కాబట్టి ప్రజల కోసం పని చేసే టువంటి తెలుగుదేశం ప్రభుత్వాన్ని వచ్చే ఎన్నికల్లో ఆదరించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ నాయకులు మైనారిటీ యువత . పాల్గొన్నారు.
Comments