top of page
Writer's picturePRASANNA ANDHRA

27న జగన్ బహిరంగ సభను విజయవంతం చేద్దాం - ఎమ్మెల్యే రాచమల్లు

27న జగన్ బహిరంగ సభను విజయవంతం చేద్దాం - ఎమ్మెల్యే రాచమల్లు

ప్రొద్దుటూరు మార్చి 23, ప్రసన్న ఆంధ్ర


రాష్ట్రవ్యాప్తంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈనెల 27న ఇడుపులపాయ నుండి ఇచ్చాపురం వరకు చేపట్టిన బస్సు యాత్ర నేపథ్యంలో ప్రొద్దుటూరులో నిర్వహిస్తున్న మొట్టమొదటి బహిరంగ సభను వైసీపీ శ్రేణులంతా కలిసి విజయవంతం చేద్దామని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం సాయంత్రం స్థానిక పాలిటెక్నిక్ కళాశాల ఎదురుగా ఉన్న మైదానంలో ఆయన వైసిపి నాయకులు ప్రజాప్రతినిధులు కార్యకర్తల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జగన్ బహిరంగ సభను విజయవంతం చేయడానికి దశ దిశ నిర్దేశం చేశారు. ఈనెల 27న ఈడ ఉల్లిపాయలు 11 గంటలకు సీఎం జగన్ బస్సు యాత్ర ప్రారంభం అవుతుందని మధ్యాహ్నం రెండు గంటలకు ప్రొద్దుటూరు చేరుకుంటారని సాయంత్రం నాలుగు గంటలకు బహిరంగ సభ వేదికకు చేరుకుంటారని తెలిపారు. ఈ సభకు లక్ష 50 వేల తో జన సమీకరణ చేయాలన్న లక్ష్యం పెట్టుకోవాలని ఆదేశించారు. మే 13న జరగబోవు సార్వత్రిక ఎన్నికలలో అంటే 45 రోజులు వైసిపి శ్రేణులు కష్టపడి పనిచేసి వైసిపి అధికారం చేపట్టేలా ఉంటుందన్నారు. ప్రత్యర్థి టిడిపి అభ్యర్థి వరదరాజుల రెడ్డి ప్రొద్దుటూరు నియోజకవర్గంలో అభివృద్ధి నిరోధకుడని 35 సంవత్సరాలు అధికారంలో ఉండి ఏమి చేయలేని నిస్సహాయుడని 85 సంవత్సరాల వయసులో ఎలాంటి అభివృద్ధి చేస్తాడో ప్రజలకు వివరంగా తెలియచేయాల్సిన అవసరం మనపై ఉందన్నారు

వైసీపీ గెలవడానికి జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రొద్దుటూరు నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలు వివరించేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. ఒక క్రమశిక్షణతో ప్రభుత్వం ప్రజలకు చేసిన మేలును ప్రచారం చేస్తే విజయం తధ్యమని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు వాటి లబ్ధి గురించి వివరించారు. సభను సూపర్ సక్సెస్ చేసే విధంగా ప్రణాళిక రూపొందించుకుని నేటి నుండే ప్రజలని సంసిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రొద్దుటూరులో జరిగే మేము సంసిద్ధం కార్యక్రమానికి సంబంధించిన గోడ పత్రాలను ఆయన విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైసీపీ అదనపు కార్యదర్శి నరసింహారెడ్డి ఆప్కాబ్ చైర్పర్సన్ మల్లెల ఝాన్సీ మున్సిపల్ చైర్పర్సన్ భీమునిపల్లి లక్ష్మీదేవి నాగరాజు మరియు బీసీ కార్పొరేషన్ డైరెక్టర్లు వైసిపి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.



83 views0 comments

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page