మహానేత వైఎస్సార్ ఆశయ సాధనే లక్ష్యంగా అభివృద్ధి, సంక్షేమం - సజ్జల రామకృష్ణారెడ్డి,రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి ఆర్కే రోజా, కడప పార్లమెంట్ సభ్యులు అవినాష్ రెడ్డి - నూతన మార్కెట్ నిర్మాణానికి భూమిపూజ
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన తండ్రి మహానేత వైఎస్సార్ ఆశయ సాధనే లక్ష్యంగా అభివృద్ధి, సంక్షేమం దిశగా అడుగులు వేస్తూ, ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయడంతో పాటు చెప్పనటువంటి సంక్షేమ పథకాలను కూడా అమలు చేస్తూ రాష్ట్రాన్ని సంక్షేమ బాటన పయనింపజేస్తున్నారని ప్రభుత్వ ముఖ్య సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి, రాష్ట్ర పర్యాటకశాఖా మంత్రి ఆర్కే రోజా, కడప పార్లమెంట్ సభ్యులు అవినాష్ రెడ్డి పేర్కొన్నారు. ప్రొద్దుటూరు పట్టణంలో రూ.50.90 కోట్లతో నిర్మించనున్న నూతన మార్కెట్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే రాచమల్లు ఆధ్వర్యంలో మంగళవారం అట్టహాసంగా భూమిపూజ నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు మంత్రులు రోజా, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, కడప నగర మేయర్ సురేష్ బాబు, జిల్లాలోని పలువురు ఎమ్మెల్యే లు హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రగ్రహణం వీడిందని, మహానేత వైఎస్సార్ ఆశయ సాధనే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేస్తున్నారన్నారు. ముఖ్యంగా వ్యవసాయరంగానికి అధిక ప్రాధాన్యతను కల్పించడం జరుగుతోందన్నారు. సమాజంలోని పేద, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా నవరత్నాలను అమలు చేస్తూ ప్రతి పేద కుటుంబానికి ఆర్థిక చేయూతను అందిస్తున్నామన్నారు. మరో 20 సంవత్సరాల పాటు జగన్ మోహన్ రెడ్డి నే సీఎంగా ఉంటారన్నారు.
ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ప్రొద్దుటూరులో అభివృద్ధి శూన్యమన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పాదయాత్రలో ఇచ్చిన హామీలనే కాకుండా ఇవ్వని హామీలను సైతం ముఖ్య మంత్రి నెరవేరుస్తున్నారన్నారు. ప్రొద్దుటూరు పట్టణంలో 24వేల పేదలకు ఇంటి పట్టాలు ఇవ్వడమే కాకుండా రూ.1.80లక్షలు ఒక్కొక్క ఇంటికి ఋణాన్ని, జగనన్న కాలనీల్లో రూ.300 కోట్లతో మౌలిక వసతులను ఏర్పాటు చేస్తున్నా మన్నారు. అలాగే రూ.530 కోట్లతో ప్రొద్దుటూరు నియోజకవర్గ పరిధిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నామన్నారు. ఇప్పటికే రూ. 120కోట్ల తో అమృత్ పథకం ద్వారా పైపులైన్ పనులను పూర్తి చేస్తున్నామని, కేవలం పది శాతం పనులే మిగిలి ఉన్నాయని పేర్కొన్నారు. అలాగే రూ.163కోట్లతో ప్రధాన కాలువల ఆధునీకరణ, 119 కోట్లతో మంచి నీటి పైపు లైన్ ఆధునీకరణ, రూ.53కోట్లతో రామేశ్వరం, ఆర్టీపీపీ హైవే బ్రిడ్జి, రూ. 5 కోట్లతో ఆర్టీసీ బస్టాండు ఆధునీకరణ, రూ.66 కోట్లతో ఇంజనీరింగ్ కళాశాల అభివృద్ధిపనులు, రూ.21 కోట్లతో ప్రభుత్వాసుపత్రి ఆధునీకరణ పనులను చేపట్టడం జరుగుతోందన్నారు. నియోజకవర్గ మౌలిక వసతుల కోసం ప్రభుత్వం రూ.8.86 కోట్ల మంజూరు చేసిందన్నారు. మార్కెట్ యార్డు భూమిపూజ మహోత్సవానికి తరలి వచ్చిన ప్రజా ప్రతినిధులకు, నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమానికి జడ్పీ చైర్మన్ ఆకెపాటి అమర్నాథ్ రెడ్డి, ఎమ్మెల్యే డా. సుధా, అప్కాబ్ రాష్ట్ర చైర్మన్ మల్లెల ఝాన్సీరాణి, రాజారామిరెడ్డి, పోరెడ్డి నరసింహారెడ్డి, కాకర్ల నాగశేషారెడ్డి, పద్మశాలీయ కార్పొరేషన్ చైర్మన్ జింకా విజయలక్ష్మి, మున్సిపల్ చైర్పర్సన్ భీమునిపల్లి లక్ష్మీదేవి, వైస్ చైర్మన్ బంగారు మునిరెడ్డి, వరికూటి ఓబులరెడ్డి, కల్లూరు నాగేంద్రారెడ్డి, గోవర్ధన్ రెడ్డి, మల్లిళ్లారు యాదవ్, ఎమ్మెల్యే సతీమణి రమాదేవి, చిప్పగిరి ప్రసాద్, మారుతీ ప్రసాద్, జిల్లా వ్యవసాయ సలహామండలి చైర్మన్ సంబటూరు ప్రసాద్ రెడ్డి, పలువురు శాసనసభ్యులు, కార్పొరేషన్ చైర్మన్లు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్ లు, డైరెక్టర్లు, రైతులు, పట్టణ ప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నారు.
Comments