మేడే ఉత్సవాలు నిర్వహించి శ్రమశక్తి అవార్డులు ఇవ్వండి - అగనంపూడి అఖిలపక్ష కార్మిక సంఘ నాయకులు.
అగనంపూడి సీడబ్ల్యూసిలో జరిగిన అఖిలపక్ష కార్మిక సంఘాలు సమావేశంలో విశాఖ పార్లమెంటరీ టీఎన్టియూసి అధికార ప్రతినిధి బలిరెడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ వైస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన నాటి నుండి ఇప్పుడు వరకు మేడే ఉత్సవాలు నిర్వహణ శ్రమశక్తి అవార్డులు ఇవ్వకపోవడం శోచనీయం ఏపీ రాష్ట్రంలో కార్మిక సమస్యలు పై నిరంతరం పోరాటం చేసి కార్మిక నాయకులు ఎంతో మంది ఉన్నారని అటువంటి కార్మిక నాయకులకు శ్రమశక్తి అవార్డులు ఇవ్వకపోవడం బాధాకరం అని గ్రామ వార్డు వాలంటీర్స్ లకి వారి సేవలని గుర్తించి అవార్డులు మరియు 20 వేల,30 వేల చొప్పున2 లక్షల 33 వేల మంది వాలెంటర్ల్లు 239 కోట్లు నగదు వెచ్చించి బహుమతి కూడా ఇవ్వడం జరిగింది. అదే శ్రమశక్తి అవార్డుకు ప్రశంసా పత్రం,శాలువా, షీల్డ్ ఇవ్వడం జరుగుతుంది, అది కూడా వైయస్సార్సీపి ప్రభుత్వం ఇప్పటివరకు ఇవ్వలేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర పరిపాలన నిమిత్తం ఎంతో బిజీ గా ఉంటారు రాష్ట్ర లెబర్ కమిషనర్ మరియు జిల్లాల వారీగా లేబర్ అధికారులు ఈ మేడే ఉత్సవాలు పెట్టాలని, శ్రమశక్తి అవార్డ్ ఇవ్వాలని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వెల్లకపోవడం వారి నిర్లక్ష వైఖరిని ఖండిస్తున్నాం అని కావున 2019, 2020, 2021, మరియు 2022 సంవత్సరాల రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు భవన నిర్మాణ కార్మిక, మోటర్ కార్మిక నాయకులను గుర్తించి మేడే ఉత్సవాలు నిర్వహించి, శ్రమశక్తి అవార్డ్లు ఇవ్వాలని అఖిలపక్షా కార్మిక నాయకులు తరుపున కోరుతున్నాం ఆంధ్రప్రదేశ్ కి తలమానికం అయిన విశాఖపట్నం లో ఎండాడ లో కార్మికశాఖ భవనం కి స్థలం ఇచ్చి యేండ్లు గడుస్తున్నా నిర్మాణం చేప్పటడం జరగలేదని కావున రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించి కార్మికశాఖ భవనాన్ని నిర్మించాలని కోరుతున్నాం. శ్రమశక్తి అవార్డు గురించి రాష్ట్రంలో ఉన్న వైస్సార్సీపీ ఎంపీలు,ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యే లు కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వెళ్లాలని కోరుచున్నాము అన్నారు.
విశాఖ పార్లమెంటరీ టీఎన్టియూసి కార్యదర్శి శీరంశెట్టి బాబ్జి సబాధ్యక్షత జరిగిన సమావేశంలో వైఎస్సార్టియూ నాయకులు గెద్దాడ అప్పలరాజు,విశాఖ జిల్లా టీఎన్టియూసి మోటార్ డ్రైవర్స్ నాయకులు సింగిడి సింహాచలం, ఐఎన్టీయూసి నాయకులు దానబాల అప్పలనాయుడు, సీఐటీయూ నాయకులు వంకర రాము,ఏఐటీ యూసీ నాయకులు అలమండ శ్రీనివాసరావు , అగనంపూడి శ్రీ బొర్రామాంబ బిల్డింగ్ వర్కర్స్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు సాయిన అప్పారావు,సీడబ్ల్యూసి ప్రతినిధి శీరంశెట్టి శ్రీనివాసరావు మరియు కార్మిక సంఘ నాయకులు పాల్గొన్నారు.
Comments