మేడే స్ఫూర్తితో ముందుకు సాగుదాం...
చిట్వేలు లో మేడే సందర్భంగా రెవెన్యూ కార్యాలయం వద్ద జెండా ఎగరవేసిన సిఐటియు నేతలు
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా మేడే స్ఫూర్తితో కార్మికవర్గం ఐక్య పోరాటాలతో ముందుకు సాగాలని అన్నమయ్య జిల్లా చిట్వేలి మండల ఎస్ఎఫ్ఐ అధ్యక్షుడు పగడాల భరత్ కుమార్ పిలుపునిచ్చారు.
ఆదివారం నాడు అన్నమయ్య జిల్లా చిట్వేల్ మండలంలోని రెవెన్యూ కార్యాలయం వద్ద సిఐటియు జెండాను మేడే సందర్భంగా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా చిట్వేలి మండల సిఐటియు నాయకులు మాట్లాడుతూ.. ప్రభుత్వాలు కార్మిక సంక్షేమం మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సింది పోయి కార్మిక హక్కులను కాలరాసే పద్ధతిలో వ్యవహరిస్తున్నాయని... అనేక త్యాగాలు పోరాటాలు చేసి సాధించుకున్న కార్మిక వర్గ హక్కులను నిర్వీర్యం చేసే పద్ధతిలో 44వ కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడలుగా మార్పు చేసి తీవ్ర ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నాలు చేస్తున్నారని. ఒక వైపు పెరుగుతున్న ధరలు, మరోవైపు తక్కువ వేతనాలతో కార్మికవర్గ కుటుంబం గడవడం చాలా కష్టంగా మారిందని ప్రస్తుతం ఇస్తున్న వేతనాలు కార్మిక వర్గానికి ఏమాత్రం సరిపో నందున కుటుంబంలో ఆహారధాన్యాలు వినియోగం అవసరమైన మేరకు కాకుండా తక్కువ వినియోగం చేయాల్సిన పరిస్థితి వస్తుందన్నారు.
విద్యా వైద్య రంగాల ను ఉచితంగా అందించేందుకు ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తే కార్మికవర్గం హాయిగా బతికే అవకాశాలు ఉన్నాయి.. కానీ వీటిని ఏ మాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేయడం సమంజసం కాదని చిట్వేలు మండలం సిఐటియు నాయకులు తెలియజేశారు. మండల సిఐటియు అధ్యక్షురాలు పగడాల సుధామణి మాట్లాడుతూ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా అంగన్వాడీవర్కర్లు,హెల్పర్లు, ఆశ కార్యకర్తల వేతనాలను తక్షణమే పెంచాలని ఆమె డిమాండ్ చేశారు.
జిల్లా రైతు సంఘం కార్మిక సంఘo కార్యదర్శి పందికాల మణి మాట్లాడుతూ రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర రేటు కల్పించాలని,ప్రతి కార్మికుడికి ఎనిమిది గంటలు నిద్ర 8 గంటలు విశ్రాంతి ఎనిమిది గంటల పనివేళలు కల్పించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమానికి చిట్వేలి మండల సిఐటియు అధ్యక్షురాలు పగడాల సుధామణి, మండల కార్యదర్శి సుజాత,పుల్లంపేట మండల సిఐటియు అధ్యక్షురాలు శ్రీలక్ష్మి, జిల్లా రైతు సంఘo కార్మిక కార్యదర్శి పందికాళ్ల మణి, కుల వివక్ష వ్యతిరేక సంఘం డివిజన్ కన్వీనర్ ఓబిలి పెంచలయ్య, టాక్సీ యూనియన్ కార్యదర్శి నాని, ఆటో యూనియన్ అధ్యక్షుడు నాగిరెడ్డి, మరియు కార్మికులు, అంగన్వాడీ వర్కర్లు మరియు హెల్పర్లు, పంచాయతీ కార్మిక కార్మికులు, పెయింటరలు పెంచలయ్య, సంపత్,రైతులు, భవన నిర్మాణ కార్మికులు, గ్రామ సేవకులు కొరముట్ల సుధాకర్ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Comments