మేడే ను విజయవంతం చేయండి.... సిఐటియు
చిట్వేలి... ప్రపంచ కార్మిక దినోత్సవ 136వ మేడే దినోత్సవాన్ని జయప్రదం చేయాలని అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు యదురూరి సుజాత,పగడాల సుధామణి లు కోరారు.
ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా పాల్గొన్న వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పంది కాళ్ళ మణి, కెవిపిఎస్ డివిజన్ కన్వీనర్ ఓబిలి పెంచలయ్య ఎస్ ఎఫ్ ఐ మండల అధ్యక్షులు పగడాల భరత్ కుమార్ తో కలిసి మేడే కరపత్రాలను స్థానిక ఎంఈఓ ఆఫీస్ ఆవరణంలో విడుదల చేశారు.
ఈ సందర్భంగా అధ్యక్ష, కార్యదర్శి మాట్లాడుతూ 8 గంటల పని 8 గంటలు నిద్ర 8 విశ్రాంతి కోసం అమెరికా చికాగో నగరంలో కార్మికుల మృత వీరుల త్యాగాల ఫలితంగా 1886లో పోరాట ఫలితంగా 8 గంటల పని సాధించడం జరిగిందన్నారు
నేడు కేంద్రములో బిజెపి ప్రభుత్వం దేశంలో పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను 4 కోడ్ లుగా విభజించి పెట్టుబడిదారులకు అనుకూలంగా మార్చి వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అందరూ కలిసి పోరాడాలని మతతత్వానికి వ్యతిరేకంగా లౌకిక తత్వం కోసం కృషి చేయాలన్నారు. సోషలిస్ట్ సమాజంలోనే కార్మికులకు, కర్షకులకు,రక్షణ ఉంటుందన్నారు. రేపు జరగబోయే మేడే కార్యక్రమంలో అందరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు ఇంకా ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్లు పాల్గొన్నారు.
Comments