మేడే..ను జయప్రదం చేయాలని పిలుపు. పుల్లంపేట లో సిఐటియు నాయకులు కరపత్రాలు విడుదల.
ప్రపంచ కార్మిక దినోత్సవం 136 వ మేడే దినోత్సవం జయప్రదం చేయాలని, సి ఐ టి యు నాయకులు పుల్లంపేట లో కరపత్రాలను విడుదల చేశారు, ముఖ్య అతిథిగా పాల్గొన్న సి ఐ టి యు కడప జిల్లా కార్యదర్శి సిహెచ్ చంద్రశేఖర్, మాట్లాడుతూ...ఎనిమిది గంటల పని, 8 గంటల గంటల నిద్ర, , ఎనిమిది గంటల విశ్రాంతి కోసం అమెరికా చికాగో నగరంలో కార్మికుల మృత వీరుల త్యాగాల ఫలితం 1886లో పోరాట ఫలితంగా ఎనిమిది గంటల పని సాధించడం జరిగింది అన్నారు. నేడు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, దేశంలో పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను, నాలుగు కోడులు గా, పెట్టుబడిదారులకు అనుకూలంగా మార్చి వేశారన్నారు.
పన్నెండు గంటలకి పనిగంటలు పెంచడం చేశారన్నారు. దీన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడాలని, మత తత్వానికి వ్యతిరేకంగా, లౌకికతత్వం కోసం కృషి చేయాలని కోరారు, సోషలిస్టు సమాజం లోనే కార్మికులు, కర్షకులకు, రక్షణ ఉంటుందన్నారు. ఎర్ర జెండా ఎగరేసి మే డే జయప్రదం చేయాలనీ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సి ఐ టి యు జిల్లా కమిటీ సభ్యురాలు, ఎస్ శ్రీ లక్ష్మి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పంది కాళ్ళ మణి, కెవిపిఎస్ డివిజన్ కన్వీనర్ ఓబిలీ. పెంచలయ్య, అంగన్వాడీ యూనియన్ ప్రాజెక్ట్ అధ్యక్షురాలు, రమాదేవి, సహాయ కార్యదర్శి, రాధా, ఉపాధ్యక్షులు, సుజాత, సి ఐ టి యు మండల నాయకులు, డి వనజాక్షి, నాగలత, అంగన్వాడి మండల నాయకులు, రోజా, వెంకటలక్ష్మి, ఆదిలక్ష్మి, ఆశాలత, విజయలక్ష్మి, పార్వతి. శ్రీదేవి, చిట్వేల్ సిఐటియు నాయకులు, విజయ్ కుమార్ నాని, తదితరులు పాల్గొన్నారు.
Comments