వరద బాధితులను అన్ని విధాల ఆదుకున్న ప్రభుత్వం - మేడా
ప్రసన్న ఆంధ్ర -రాజంపేట :
2021 నవంబర్ లో జవాద్ తుఫాన్ కారణంగా నష్టపోయిన వరద బాధితులను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకున్నదని శాసనసభ్యులు మేడా వెంకట మల్లిఖార్జున రెడ్డి తెలియజేశారు. అన్నమయ్య డ్యాం తెగిపోవడం వలన నిరాశ్రయులైన ఆరు కుటుంబాల వారికి ఏపీఎండీసి లో ఉద్యోగాలు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వారికి బోయిన పల్లె లోని ఎమ్మెల్యే కార్యాలయంలో శనివారం మేడా మల్లిఖార్జున రెడ్డి, జెడ్పి చైర్మన్ ఆకేపాటి అమర్ నాథ్ రెడ్డి లు ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా వారిరువురూ మాట్లాడుతూ గత ఏడాది అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం లోని అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయి మృతిచెందిన బాధిత కుటుంబాలకు ఊరట లభించిందని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పిన మాట ప్రకారం బాదిత కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించారని అన్నారు. వరద బాధితులను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుందని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో కడప జిల్లా కబడ్డీ అసోసియేషన్ చైర్మన్ యోగేశ్వర్ రెడ్డి, సర్పంచ్ జగన్ మోహన్ రెడ్డి, నాగిరెడ్డిపల్లి సర్పంచ్ జంబు సూర్య నారాయణ, వీరబల్లి మండలం ఎంపీపీ రాఘవేంద్ర రెడ్డి, రాజంపేట వార్డు కౌన్సిలర్ పసుపులేటి సుధాకర్, దాసరి పెంచలయ్య, పులపుత్తూరు గ్రామస్తులు పాల్గొన్నారు.
Comments