సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి - మళ్లీ జగన్ ను సీఎం చేయాలి - మేడా
ప్రసన్న ఆంధ్ర -రాజంపేట :
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రజలలోకి తీసుకెళ్లాలని, తిరిగి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలని శాసనసభ్యులు మేడా వెంకట మల్లిఖార్జున రెడ్డి అన్నారు. గురువారం మునక్కాయ పల్లె రోడ్డు లో గల ఎన్.వి.ఆర్ కన్వెన్షన్ హాలులో ఎంపీటీసీలు, సర్పంచులు, సచివాలయ కన్వీనర్లు, గృహసారథులు, వాలంటీర్లతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాసనసభ్యులు మేడా వెంకట మల్లిఖార్జున రెడ్డి, ఉమ్మడి జిల్లాల జడ్పీ చైర్మన్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, మండల అధ్యక్షులు ఆకేపాటి మురళి రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సచివాలయ కన్వీనర్లు, గృహసారథులు, వాలంటీర్లు తమకు కేటాయించిన కుటుంబాల వద్ద ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ ఇష్టపడి పనిచేసి జగన్మోహన్ రెడ్డి పది కాలాలపాటు ముఖ్యమంత్రిగా కొనసాగేలా కృషి చేయాలని సూచించారు. సంక్షేమ పథకాలను మెరుగుపరిచేందుకు 8 2 9 6 0 8 2 9 6 0 నెంబర్కు మిస్డ్ కాల్ చేస్తే ఐదు నిమిషాలలో ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఫోన్ సంభాషణ ద్వారా జవాబు లభిస్తుందని.. ఈ అవకాశాన్ని వినియోగించుకుని ప్రభుత్వానికి సలహాలు, సూచనలు చేయవలసినదిగా తెలిపారు. అనంతరం కొత్తగా నియమితులైన సచివాలయ కన్వీనర్ల ఇన్చార్జి మందరం గంగిరెడ్డి కి గృహ సారధుల కిట్టును అందజేశారు. కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ భోజనం ఏర్పాటు చేసి స్వయంగా మేడా మల్లికార్జున్ రెడ్డి వడ్డించారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు యోగేశ్వర్ రెడ్డి, కొండూరు శరత్ కుమార్ రాజు, ఊటుకూరు ఎంపీటీసీ నాగ చంద్రశేఖర్ రెడ్డి, సర్పంచ్ ఈశ్వరయ్య, పృథ్విపతి రెడ్డి, సుధాకర్ రెడ్డి, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు పాల్గొన్నారు.
Comments