వైఎస్ఆర్ జిల్లా
విద్యుత్ ఉద్యోగ కార్మికుల సమస్యలపై 26 విజయవాడ లో జరుగు రాష్ట్ర సదస్సు ను జయప్రదం చేయలని స్ట్రగుల్ కమిటీ నాయకులు కరపత్రాలు విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యుత్ ఉద్యోగుల సమస్యలు యాజమాన్యం పరిష్కరించకుండా చర్చల పేరుతో కాలయాపన చేస్తున్నాదే తప్ప ఉద్యోగుల కార్మికుల సమస్యలు పరిష్కరించే వాతావరణం కనబడలేదని మండిపడ్డారు స్ట్రగుల్ కమిటీ చేసే పోరాటానికి కార్మికులంతా కలిసి రావాలని వారు కోరారు.
విద్యుత్ ఉద్యోగులకు 45% పిట్మెంటుతో పిఆర్సి ప్రకటించాలని, విద్యుత్ కాంట్రాక్టు కార్మికులందరికీ పర్మినెంట్ చేయాలని, జేఎల్ఎం గ్రేడ్ 2 ఎనర్జీ అసిస్టెంట్లకు ప్రొవిషన్ డిక్లేర్ చేయాలని చనిపోయిన వారి కుటుంబంలో కారుణ్య నియామకాలు చేపట్టాలని, ఈపీఎఫ్ నుంచి జిపిఎఫ్ గా ఉద్యోగులందరికీ మార్పు చేసి పెన్షన్ సౌకర్యం కల్పించాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో స్ట్రగుల్ కమిటీ నాయకులు పి సుదర్శన్ రెడ్డి, వెన్నపూస సుబ్బిరెడ్డి, పొన్నా.శివయ్య, కర్నాటిబ్రహ్మానందరెడ్డి, శివశంకర్, నాయుబ్, గురుస్వామి, కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ ఈశ్వరయ్య, బద్వేల్ శ్రీనివాసులు, వి గంగయ్య, పి సురేష్ బాబు, కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏఐటియుసి జిల్లా కార్యదర్శి ఎల్ నాగ సుబ్బారెడ్డి, సిఐటియు జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాలొగొన్నారు
Comments