జనసేన అధినేత ముందస్తు జన్మదిన వేడుకల్లో భాగంగా... జనసేనకుల ఆధ్వర్యంలో...
రైల్వే కోడూరు పట్టణంలో మెగా రక్తదాన శిబిరం.
అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు పట్టణంలోని వైజయంతి హాస్పిటల్ లో గురువారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా రైల్వేకోడూరు జనసేన దళిత నాయకుడు నగిరిపాటి మహేష్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జనసేన రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర, వైజయంతి హాస్పిటల్ చైర్మన్ వైజయంతి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మొదటగా రక్తదానం చేయడానికి విచ్చేసిన పవన్ కళ్యాణ్ అభిమానులు జనసైనికులు వీర మహిళలు శ్రీ దీప బ్లడ్ సెంటర్, రాయచోటి వారి పర్యవేక్షణలో సుమారు 150 మంది పాల్గొని రక్త దానం చేశారు.రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి ప్రశంసా పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా నాగేంద్ర మాట్లాడుతూ.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ముందస్తు వేడుకల్లో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం చాలా సంతోషకారంగా ఉందని ఈ కార్యక్రమానికి విచ్చేసి రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నీతి, నిజాయితీ, నిబంధత గల ఏకైక నాయకులు పవన్ కళ్యాణ్ అని తెలియజేశారు.
రక్తదాన శిబిరం నిర్వాహకులు మహేష్ మాట్లాడుతూ.. నిస్వార్ధమైన సేవ చేస్తూ తన కష్టార్జితాన్ని కౌలు రైతుల కోసం, సాయం చేస్తూ నేనున్నానంటూ భరోసానిచ్చే ఏకైక నాయకుడు,కర్షకుడు మా అధినేత పవన్ కళ్యాణ్ కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నామని, ఆయన స్ఫూర్తితోనే ఇవాళ ఈ మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని స్వచ్ఛందంగా విచ్చేసి రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.
ఈ మెగా రక్తదాన శిబిరంలో జనసేన నాయకులు ఉత్తరాది శివకుమార్,గంధం శెట్టి దినకర బాబు, మర్రి రెడ్డి ప్రసాద్,అంకి శెట్టి మణి, ముత్యాల కిషోర్, సాయం శ్రీధర్,ఆలం రమేష్,శింగిరి రాజ,దశరథ్, హేమంత్,హరీష్ మరియు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేశారు.
Comentarios