top of page
Writer's pictureEDITOR

మెగా లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలి - సీఐ నరసింహారావు

మెగా లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలి - సీఐ నరసింహారావు

ర్యాలీ నిర్వహిస్తున్న పోలీసు శాఖ

ప్రసన్న ఆంధ్ర, రాజంపేట


రేపు నిర్వహించే మెగా లోక్ అదాలత్ ను కక్షిదారులు, ఫిర్యాదు దారులు సద్వినియోగం చేసుకోవాలని అర్బన్ సీఐ నరసింహారావు పేర్కొన్నారు. వారి వారి కేసులను పరిష్కరించుకునేందుకు ఇది సద్వకాశమని., ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు మెగా లోక్ అదాలత్ పైన పోలీసు సిబ్బంది రాజంపేట పట్టణ పరిధిలో గురువారం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ సీఐ నరసింహారావు మాట్లాడుతూ రాజీమార్గమే రాచమార్గమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సై లక్ష్మీ ప్రసాద్ రెడ్డి, మహిళా పోలీసులు, భవన నిర్మాణ కార్మికులు పాల్గొన్నారు.


6 views0 comments

Comentarios

Obtuvo 0 de 5 estrellas.
Aún no hay calificaciones

Agrega una calificación
bottom of page