మెప్మా అర్బన్ మార్కెట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే వరద
వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా వారి ఆధ్వర్యంలో ప్రొద్దుటూరులోని స్థానిక పుట్టపర్తి సర్కిల్ నందు చేతివృత్తుల మెప్మా మహిళలచే తయారు చేయబడిన పలు రకాల పిండి వంటలు, వస్తువుల మెప్మా అర్బన్ మార్కెట్ ను ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి శనివారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా మునిసిపల్ కమిషనర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతీ నెల 2 రోజుల పాటు స్వయం సహాయక సంఘాల వారి అర్బన్ మార్కెట్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. మెప్మా అధికారి కెజియా మాట్లాడుతూ, 2964 స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో ఈ మెప్మా అర్బన్ మార్కెట్ ఏర్పాటు చేశామన్నారు. పట్టణ ప్రజలు ఈ మార్కెట్ ను సందర్శించి వారికి కావాల్సిన వాటిని కొనుగోలు చేయొచ్చన్నారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ ఆసం రఘురామిరెడ్డి, పురపాలక కమిషనర్ రఘునాథరెడ్డి, మెప్మా టి.ఈ కెజియా, మున్సిపల్ కౌన్సిలర్లు వంగనూరు మురళీధర్ రెడ్డి, కమల్ భాష, పలువురు టిడిపి ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
Comentários