ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో కడప జిల్లా పొద్దుటూరు చెందిన శాసన మండలి సభ్యుడు ఆర్ వి రమేష్ యాదవ్ స్థానం కల్పించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి చిట్టి పోయిన సుబ్రహ్మణ్యం యాదవ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కోరుతున్నట్లు బుధవారం ప్రకటన విడుదల చేశారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా కడప జిల్లాలో బీసీ సామాజిక వర్గానికి రమేష్ యాదవ్ కు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి బీసీల పట్ల తమకు ఉన్న ప్రేమను ముఖ్యమంత్రి చాటుకున్నారని తెలిపారు ముఖ్యమంత్రి తమ సొంత జిల్లాలో ఎన్నో సంవత్సరాలుగా బీసీ కులాలకు అందని ద్రాక్షగా ఉన్న మంత్రి పదవిని ఆర్ వి రమేష్ యాదవు తో భర్తీ చేయాలని కోరుతున్నట్లు వివరించారు బీసీ పక్షపాతిగా పేరు ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గుర్తింపుకు సార్థకత చేకూర్చాలని కోరారు నమ్మకం విశ్వాసానికి మారుపేరు ఓపిక ఉన్నంతవరకు కాదు ఊపిరి ఉన్నంతవరకు జగనన్నతోనే చాటి చెబుతున్న రమేష్ యాదవ్ అవకాశం కల్పించి రాష్ట్ర బీసీల అభ్యున్నతికి కృషి చేసిన వ్యక్తి ముఖ్యమంత్రి నిలిచిపోవాలని ఆకాంక్షిస్తూనాట్లు తెలిపారు రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రత్యేక గుర్తింపు పొందిన విద్యావంతులు సౌమ్యుడు విశ్వాసపాత్రుడు అయినటువంటి రమేష్ యాదవ్ కు మంత్రివర్గంలో స్థానం కల్పించి రాష్ట్ర అభివృద్ధిలో తమ పాత్ర పోషించేందుకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నట్లు తెలిపారు.
Comments