మిషన్ పాట్ హోల్ ఫ్రీ ఏపీ పనులు పర్యవేక్షించిన టిడిపి నాయకులు
వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
మిషన్ పాట్ హోల్ ఫ్రీ ఏపీ - గుంతలు రహిత ఆంధ్ర ప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా రోడ్డు మరమ్మత్తులకు శ్రీకారం చుట్టిన కూటమి ప్రభుత్వం, 600 కోట్ల రూపాయల నిధులతో రాష్ట్రవ్యాప్తంగా రోడ్డు మరమ్మత్తులు చేపట్టనుంది, ఇందులో భాగంగా ప్రొద్దుటూరు నియోజకవర్గానికి 10 లక్షల రూపాయలు కేటాయించినట్లు అధికారులు తెలిపారు. శనివారం ఉదయం స్థానిక కొత్తపల్లి పంచాయతీ పరిధిలోని మైదుకూరు రోడ్డు నందు గత నెల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్డు మరమ్మత్తు పనులను మాజీ మండలాధ్యక్షులు నంద్యాల రాఘవరెడ్డి, కొత్తపల్లి పంచాయతీ సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్ర రెడ్డి ప్రారంభించి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గడచిన ఐదు సంవత్సరాల వైసిపి ప్రభుత్వ హయాంలో రోడ్లన్నీ గుంతలమయం అయ్యాయని, మరమ్మత్తులకు నోచుకోక వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని, ఇది గ్రహించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మిషన్ పాట్ హోల్ ఫ్రీ ఏపీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రోడ్డు మరమ్మత్తులు ప్యాచింగ్ పనులు చేపట్టారని అన్నారు. కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి తోటా మహేశ్వర్ రెడ్డి, ఆర్ అండ్ బి ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.
Comments