వాలంటీర్ల వ్యవస్థ దేశానికే ఆదర్శమన్న - మిధున్ రెడ్డి, మేడా, ఆకేపాటి.
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వాలంటీర్ల వ్యవస్థ దేశానికే ఆదర్శమని రాజంపేట పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి, శాసనసభ్యులు మేడా వెంకట మల్లికార్జున రెడ్డి కడప జడ్పీ చైర్మన్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి లు పేర్కొన్నారు. సోమవారం ఉదయం రాజంపేట మున్సిపాలిటీ లోని సచివాలయ వాలంటీర్లకు వీరు ముగ్గురి చేతుల మీదుగా సేవా మిత్ర, సేవ రత్న, సేవ వజ్ర, పురస్కారాలను ప్రధానంచేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాజంపేట ఎమ్మెల్యే మేడా వెంకట మల్లికార్జున రెడ్డి మాట్లాడుతూ... గతంలో ప్రజలు ప్రభుత్వ పథకాలు పొందాలంటే కార్యాలయాల చుట్టూ అధికారుల చుట్టూ తిరిగేవారిని అయినా కూడా అధికారులు రిటైర్ కావాలే తప్ప అర్హులకు పథకాలు అందేవి కావన్నారు. నేడు ప్రభుత్వం ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ ను ఏర్పాటు చేసి అర్హులందరికీ సంక్షేమ ఫలాలు వారి ముంగిటకు చేర్చడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారులే ప్రజల వద్దకు వెళ్లాలి అనే కాన్సెప్ట్ తో సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వ పథకాలు పారదర్శకంగా ప్రజలకు అందించడంలో వాలంటీర్ల సేవలను గుర్తించిన ముఖ్యమంత్రి వర్యులు వారికి సేవా మిత్ర, సేవ రత్న, సేవ వజ్ర పురస్కారాలు అందజేయడం వల్ల నేడు సువర్ణాక్షరాలతో లిఖించబడిన రోజన్నారు.
సంక్షేమ పథకాలు వంద శాతం పేదలకు అందాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళుతుందని వాలంటీర్లు మీకు కేటాయించిన విధులు సమర్థవంతంగా నిర్వహించి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలన్నారు. ఈ సందర్భంగా రాజంపేట మునిసిపాలిటీ లో ప్రభుత్వ పథకాలను పారదర్శకంగా అర్హులందరికీ అందజేయడంలో కృషి చేసిన వాలంటీర్లు 164 మందికి సేవా మిత్ర, 5 మందికి సేవ రత్న, పురస్కారాలు ప్రదానంచేశారు. ఈ కార్యక్రమంలో రాజంపేట ఆర్ డి ఓ కోదండరామిరెడ్డి , రాజంపేట మున్సిపల్ చైర్మన్ పోలా శ్రీనివాస్ రెడ్డి , మున్సిపల్ కమిషనర్ జనార్దన్ రెడ్డి , వైస్ చైర్మన్లు , మున్సిపల్ కౌన్సిలర్లు, సచివాలయాల సిబ్బంది వాలెంటర్ల్లు స్థానిక నాయకులు అధికారులు తదితరులు పెద్ద ఎత్తునపాల్గొన్నారు.
Commenti