top of page
Writer's pictureMD & CEO

ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో పెంచిన పెన్షన్ అందచేత

ఈరోజు శ్రీకాళహస్తి పట్టణం, మున్సిపల్ కార్యాలయంలో పెంచిన పెన్షన్లను మరియు కొత్తగా వచ్చిన పెన్షన్లను లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి.


అనంతరం లబ్ధిదారులు వారి సంతోషాన్ని వ్యక్తం చేస్తూ జగనన్న చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ,లబ్ధిదారులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.దశల వారీగా పెన్షన్‌ను రూ.3 వేలు చేస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో అవ్వాతాతలకు హామీ ఇచ్చామని, అందులో భాగంగానే సీఎంగా బాధ్యతలు స్వీకరించిన రోజే రూ.2,250కు పెంచుతూ తొలి సంతకం చేసినట్లు గుర్తు చేశారు. ఇప్పుడు రూ.2,500కు పెంచామని తెలిపారు.నాడు పెన్షన్ తీసుకోవాలంటే లబ్ధిదారుడు మరణిస్తేనే కొత్త పెన్షన్ మంజూరు అయ్యేది కానీ నేడు అర్హత ఉన్న ప్రతి లబ్ధిదారుడి గడపకు నేరుగా పెన్షన్ అందిస్తున్నారు మన జగనన్న.లంచాలు లేవు,జన్మభూమి కమిటీలు లేవు, రాజకీయ కక్ష సాధింపు లేదు పార్టీలకతీతంగా ప్రతి ఒక్కరికి పెన్షన్ అందించడమే జగన్ అన్న ధ్యేయం.ప్రతి నెల ఒకటో తారీఖున కోడి కూయంగనే అవ్వాతాతలకు పెన్షన్ అందిస్తున్న వాలంటీర్లు అందరికీ పేరుపేరునా అభినందనలు.జగనన్న పేద ప్రజలకు మంచి చేస్తుంటే చూసి ఓర్వలేని ప్రతిపక్షాలు లేనిపోని అడ్డంకులు సృష్టిస్తూ సంక్షేమ పథకాలను అడ్డుకుంటున్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలకు ఏ కష్టం వచ్చినా మీ కష్టాలు తీర్చడం కోసం ఒక పనిమనిషి లాగా నేను నా బిడ్డ ఇద్దరం ఉన్నామని.30 సంవత్సరాలుగా శ్రీకాళహస్తినీ పాలించిన గత పాలకులు శ్రీకాళహస్తికి చేసిందేమీ లేదని, ఎన్నికల సమయంలో వచ్చి ప్రజలను మభ్యపెట్టి అక్రమ సంపాదనను హైదరాబాదులో కూడాబేట్టారన్నారు. కానీ తాను గత 17 సంవత్సరాలుగా నిరుపేదలు బంగారు తాళిబొట్లు అందజేశాం అని అలాగే నియోజకవర్గంలోని నిరుపేద ముస్లింలకు మేనమామ సాంగ్యమ్ కింద బీరువా మంచం అందజేస్తున్నాం అని తెలిపారు. అలాగే రాష్ట్రంలోని ఏ ఎమ్మెల్యే చేయని విధంగా కారొన సమయంలో శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలకు నిత్యవసర సరుకులు,కూరగాయలు, సి విటమిన్ టాబ్లెట్లు, పండ్లు అందజేశామని అలాగే రంజాన్ పండుగ నాడు ముస్లింలకు చికెను, బాస్మతి రైస్, నిత్యవసర సరుకులు, కూరగాయలు అలాగే ప్రతి ఇంటికి ఒక చీర అందజేశామని తెలిపారు. శ్రీకాళహస్తి ప్రజలందరూ గత పాలకుల ఎలా ఉన్నారు నేడు నేను మీ కోసం ఎలా పనిచేస్తున్నాని ఒకసారి గుర్తు చేసుకోవాలని అన్నారు. పేద ప్రజల సంతోషం కోసం అనునిత్యం శ్రమిస్తున్న జగనన్నకు మీ అందరి ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను అన్నారు.


ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Comentários

Avaliado com 0 de 5 estrelas.
Ainda sem avaliações

Adicione uma avaliação
bottom of page