కర్నూలు జిల్లా, మంత్రాలయం, ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ఆదేశాలతో మండల ఇంచార్జీ మురళీమోహన్ రెడ్డి ఆరా
కోసిగి మోడల్ స్కూల్ నందు విద్యార్థులకు కరోనా వచ్చిందనే విషయంపై స్థానిక ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి అధికారులను అడిగి తెలుసుకున్నారు.ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ఆదేశాల మేరకు తాహాశీల్దారు రుద్రగౌడ్, వైధ్యాదికారిణి కిర్తిప్రియతో కలిసి మండల ఇంచార్జీ మురళీమోహన్ రెడ్డి మోడెల్ స్కూల్ ను సందర్శించారు.ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ, కరోనా వైరస్ బారిన పడిన విద్యార్థులు ఆరోగ్య విషయాలు అడిగి తెలుసుకున్నారు.ఎవ్వరూ వదంతులను నమ్మవద్దని,అధైర్య పడకుండా,మెరుగైన వైద్యం కోసం వెంటనే హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.హస్టల్ వార్డెన్ ను ఆహారం విషయంపై ప్రత్యేక శ్రద్ధ కనపరచాలని,కరోనా వైరస్ వల్ల తీసుకుంటున్న చర్యలను ప్రిన్సిపాలును అడిగి తెలుసుకున్నారు.ఈకార్యక్రమంలో తాహశీల్దారు రుద్రగౌడ్, వైధ్యాదికారిణి కిర్తిప్రియ,యంపిపి ఈరన్న,యంపియచ్ఓ హనుమంతు,ప్రిన్సిపాల్ సమీరా, మండల నాయకులు జగదీష్ స్వామి,కోరివి నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.
Comments