మానవాళి మనుగడకు ఆధ్యాత్మిక చింతన అవసరం... ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి
ఆధునిక కాలంలో మానవాళి మనుగడకు ఆధ్యాత్మిక చింతన ఎంతైనా అవసరం ఉందని ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి అన్నారు. శనివారం కోసిగి మండల పరిధిలోని కందుకూరు గ్రామంలో వీరతపస్వి వీరభద్ర శివచార్యులు బిచ్చాలి, అభినవ మహాంతేష స్వామి హాల్వి మరియు ఆలయ కమిటీ అధ్యక్షులు శరణప్ప గౌడ్ అద్వరంలో గత మూడు రోజులుగా హోమ పూజలు నిర్వహిస్తూ, శనివారం రోజున శ్రీ రామలింగేశ్వర స్వామి జాతర సందర్భంగా నూతనంగా తయారు చేసిన రథోత్సవం మరియు సాముహిక వివాహల కార్యక్రమంకు ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి మరియు మండల ఇంచార్జీ మురళీ మోహన్ రెడ్డి ముఖ్య అతిథిలుగా పాల్గొన్నారు. ముందుగా వివిధ మఠాల పీఠాధిపతులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి, కార్యక్రమాన్ని ప్రారంభించారు. పీఠాధిపతులు ప్రవచనాలతో అశేష జనవాహినికి భక్తిసందేశాలను అందించారు. అనంతరం సాముహిక వివాహల కార్యక్రమం ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంకు విచ్చేసిన పీఠాధిపతులు, నాయకులు, అధికారులను ఆలయ కమిటీ అధ్యక్షులు శరణప్ప గౌడ్ మరియు బెట్టప్ప గౌడ్ అద్వరంలో శాలువా కప్పి, పూలమాలతో సత్కరించి, మెమెంటోను అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు నాడిగేని నరసింహులు, యంపీపీ ఈరన్న, జడ్పీటీసీ పవిత్ర పాటిల్, ఐరనగల్లు శ్రీనివాస రెడ్డి,పెద్దకడుబురు మండల నాయకులు పురుషోత్తం రెడ్డి, రాంమోహన్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, జగదీష్ స్వామి, కందుకూరు రామన్న గౌడ్, కందుకూరు తాయన్న, కామన దొడ్డి నరసింహులు, దొడ్డి నర్సన్న, జంపాపురం బసిరెడ్డి, వందగల్లు లక్ష్మయ్య, పెద్ద బోంపల్లి బీమయ్య, చిర్తనకల్లు ఈరన్న, తుమ్మిగ నూరు ఈరన్న, సజ్జలగుడ్డం మల్లయ్య, యంపీటీసి మల్లయ్య, మాజీ ఎంపీటీసీ రమేష్, బీంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments