వైయస్సార్ యంత్రసేవ పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి
గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా రైతన్నలకు తక్కువ అద్దెతో యంత్రసేవలు అందుబాటులో ఉండేలా సియం జగనన్న తీసుకురావడం జరిగిందని, రైతులందరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి తెలిపారు. ఆదివారం సాయంత్రం ఎమ్మెల్యే స్వగృహంలో కోసిగి మండలం కందుకూరు గ్రామానికి చెందిన మహాత్మా గాంధీ రైతు మిత్ర గ్రూపుకు మంజూరైన ట్రాక్టరును మండల వ్యవసాయ సలహా మండలి అధ్యక్షులు మురళీమోహన్ రెడ్డి, మండల కన్వీనర్ బెట్టనగౌడ్ తో కలిసి ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి రైతులకు అందజేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే ట్రాక్టరును నడిపి రైతులను ఉత్సహపరిచినాడు. ఈ కార్యక్రమంలో పీఏ వెంకట్రామిరెడ్డి, కందుకూరు గ్రామ నాయకులు తాయన్న, యంపీటీసీ మల్లయ్య, మాజీ ఎంపీటీసీ రమేష్, బీంరెడ్డి, వీరయ్య గౌడ్, దేవేంద్ర తదితరులు పాల్గొన్నారు.
Comments