మాపై "ఎస్మా" చట్టం మోపడం న్యాయమా..??
---కొరముట్లను ప్రశ్నించిన అంగన్వాడి సిబ్బంది.
25 రోజులుగా పైబడి జీతభత్యాల పెంపునుకై రాష్ట్రవ్యాప్తంగా సమ్మెను చేపడుతున్న మాపై "ఎస్మా"చట్టం ప్రయోగించడం ఎంతవరకు సబబని, నియోజకవర్గపు శాసనసభ్యులుగా మా సమస్యలపై మీరు ఎందుకు స్పందించరని..?? శనివారం పింఛన్ పెంపు కార్యక్రమానికి చిట్వేలికి విచ్చేసిన ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు కారును అడ్డగించి అంగన్వాడి సిబ్బంది ప్రశ్నించారు.
అంగన్వాడి సిబ్బంది 26 రోజులగా వామపక్షాల సహకారంతో సమ్మె చేస్తున్నా, పలువురు ప్రతిపక్షాలు సంఘీభావం తెలుపుతున్న... జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సమస్యను పరిష్కారం చేయకుండా అంగన్వాడి మహిళలపై, ఎస్మా చట్టం ప్రయోగించడం, వేతనాల్లో కోతను విధించడం దుర్మార్గమని, తక్షణ ఉపసహరించుకోవాలని నిలదీశారు. కాగా మా ప్రభుత్వం పదివేలు పెంచిందని ఎమ్మెల్యే కొరముట్ల చెప్పగా, అది తప్పుడు అభిప్రాయం అని, మేం పోరాటం చేస్తే లాఠీ చార్జి చేసి గత ప్రభుత్వం ఆ మొత్తాన్ని పెంచిందని, గత ప్రభుత్వం ఇచ్చిన జీవో ని 2019 లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే, వెయ్యి రూపాయలు మాత్రమే పెంచిందని గుర్తు చేశారు. రెండు రోజుల్లో వేతనాలు పెంచేందుకు వైయస్ జగన్ ప్రభుత్వం కృషి చేస్తుందని శాసనసభ్యులు కొరముట్ల హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల సిఐటియు నాయకులు అంగన్వాడీ బోధన బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.
ความคิดเห็น